మనం ఆరోగ్యకరమైన జుట్టు కోసం అనేక రకాల ప్రోడక్ట్ వాడుతూ ఉంటాం. అయితే మన ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలు జుట్టు సమస్యను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అద్భుతంగా పనిచేస్తాయని మనం గమనించం. మనకు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే కొన్ని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవే మన ఇంట్లో ఉండే బియ్యం మరియు అవిస గింజలు. బియ్యం నీటిని జుట్టు సమస్యలకు నివారణ ఉపయోగిస్తారని ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే పూర్వ కాలం నుండి బియ్యం నీటిని జుట్టు పెరుగుదలకు , జుట్టు సమస్యల నివారణ వినియోగిస్తున్నారు. బియ్యం నీరు జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది మరియు వాస్తవానికి మీ జుట్టు యొక్క రూపాన్ని మరియు మృదుత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఈ పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, జుట్టు యొక్క సాంద్రతను మెరుగుపరచడానికి మరియు ఆరోగ్యంగా మరియు మెరిసేలా చేయడానికి సహాయపడతాయి. అలాగే ఆవిశె గింజలు కూడా అనేక రకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అవిసె గింజలలో విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి, ఇవి స్కాల్ప్‌కి చికిత్స చేయడానికి, జుట్టు రాలడాన్ని నిరోధించడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఫ్లాక్స్ సీడ్ జెల్‌తో వారంవారం చికిత్సలు చేరడం జుట్టును చిక్కగా మరియు పొడిగించేందుకు చర్మ కణాలను ప్రేరేపిస్తాయని చెప్పబడింది. ఈ చిట్కా కోసం ఒక స్పూన్ అవిసె గింజలను ఒక స్పూన్ బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. వీటిని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి.
నీళ్లు బాగా మరిగిన తరువాత నీటిని వడకట్టి ఈ నీటిని చల్లారనిచ్చి స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నీటిని తలకు స్ప్రే చేసి కొద్దిగా మసాజ్ చేసి ఒక అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయడం వలన జుట్టు సమస్యలను తగ్గడం గమనిస్తారు. ఈ జెల్ తలలో పేరుకున్న విష రసాయనాలను కూడా బయటకు పంపిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా మృదువుగా చేస్తుంది. సహజంగా జుట్టు సాఫ్ట్ అండ్ స్ట్రైట్ అవ్వడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు చివర్లు చిట్లి బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ చిట్కా పాటించండి. ఈ నీటిని ఒకసారి తయారు చేసుకుని వారం వరకు నిలవ చేసుకోవచ్చు. వారంలో రెండు సార్లు ఉపయోగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.