కర్వేపాకు అన్ని కూరలలో ఉపయోగిస్తాం. కరివేపాకు ఇమ్యూనిటీపవర్ పెంచడంలో కంటిచూపును మెరుగు పరచడంలో సహాయపడుతుందని మనందరికీ తెలుసు అయినా సరే తీసి పక్కన పడేస్తారు. కర్వేపాకు యొక్క ప్రయోజనాలు తెలిస్తే కరివేపాకు తీసి పక్కన పడేయరు. కరివేపాకు వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరివేపాకు పొడి రూపంలో కూరలో ఉపయోగించడం వలన తీసి పడేయడానికి వీలు ఉండదు. కాబట్టి ఆహారంతోపాటు లోపలికి వెళుతుంది.
కరివేపాకుని లోపలికి ఉపయోగించడం ఇష్టం లేనివారు బాహ్యంగా ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులుకోరు. కరివేపాకు, మెంతులు కలిపి పేస్ట్ చేసి తలకు పెట్టడం వల్ల చుండ్రు తగ్గుతుంది జుట్టు రాలడం తగ్గుతుంది అంతేకాకుండా జుట్టు నల్లగా అవ్వడంలో కూడా సహాయపడుతుంది. జుట్టుకి ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయని సైంటిఫిక్ గా 2020 వ సంవత్సరం ప్రవర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మహారాష్ట్ర వారు నిరూపించారు. కరివేపాకు లో ఉన్న ఆల్కలాయిడ్స్ తల భాగంలో ఉండే స్కిన్ డ్రై అవ్వకుండా చేస్తాయి.
కరివేపాకులో ఉండే టర్కీనోయిడ్స్, అల్కనోయిడ్స్ పేస్ట్ చేసి పెట్టడం వలన తలలో ఉండే బ్యాక్టీరియా, ఫంగల్ని పోగొడతాయి. బ్యాక్టీరియా ఇంకా ఫంగల్ ను తగ్గించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల వెంట్రుకలు తగ్గించడంలో కరివేపాకు సహాయపడుతుంది. జెనెటిక్గా తెల్ల వెంట్రుకలు వస్తే వాటిని తగ్గించడం సాధ్యం కాదు. కానీ కొన్ని కారణాల వచ్చే తెల్ల వెంట్రుకలు తగ్గించడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్స్ వలన రక్షణ వ్యవస్థ జుట్టు కుదుళ్ల దగ్గర ఉండే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెల్లనోసైట్ దగ్గర ఉండే కణజాలాన్ని దెబ్బతీస్తుంది.
దీనివలన తెల్ల వెంట్రుకలు వస్తాయి. కరివేపాకు పొడి ఉపయోగించడం వలన సమస్య తగ్గుతుంది. కర్వేపాకు అధికంగా బీటా కెరోటిన్ కలిగి ఉంటుంది. 100 గ్రాముల కరివేపాకులో 7500 మైక్రో గ్రాముల బీటా కెరోటిన్ కలిగి ఉంటుంది. ఇది కంటి చూపుకు చాలా ముఖ్యమైనది. కరివేపాకులో బీటా కెరోటిన్ జుట్టు కుదుళ్ల నుంచి జుట్టు నల్లగా రావడానికి సహాయపడుతూ, జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. కరివేపాకు పేస్ట్ చేసి పెట్టడం వల్ల జుట్టుకి ఇన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకొక సింపుల్ పద్ధతి ఏంటంటే మార్కెట్లో కరివేపాకు ఆయిల్ జరుగుతుంది దాని తెచ్చుకొని ప్రతిరోజూ అప్లై చేసినా సరే జుట్టు కుదుళ్ళ నుండి బలంగా తయారయ్యి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.