హలో ఫ్రెండ్స్.. ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం, జుట్టు ఊడటం, చిట్లిపోవడం ఇలాంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. మనం ఎన్ని ఖరీదైన షాంపూలు వాడిన ఈ సమస్యలు మాత్రం తగ్గడం లేదు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి మీరు బయట పడాలంటే ఈ సింపుల్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఒకసారి ట్రై చేసి చూడండి. హెయిర్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఈ హెయిర్ ఆయిల్ తయారీకి కావలసిన పదార్థాలు
- మెంతులు
- కలోంజి గింజలు (Kalonji seeds) / బ్లాక్ సీడ్స్
- ఆవనునే
మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్ ప్రోటీన్స్ మన జుట్టు ఎదుగుదలకు మంచి పోషణను అందిస్తాయి. అలాగే మన జుట్టు బలంగా పెరగడానికి కూడా దోహదపడతాయి. మెంతులు మన తలమీద వేడిని తగ్గించి చుండ్రు కూడా నివారిస్తాయి. జుట్టు పొడిబారడం, జుట్టు రాలడం లాంటి సమస్యలను నివారించి మన హెయిర్ కు ఒక మంచి కండిషనర్ లా పనిచేస్తుంది.
ఈ కలోంజీ విత్తనాలలో క్యాల్షియం మరియు విటమిన్ డి, ఐరన్, జింక్ మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు పొడిబారటం వెంట్రుకలు రాలిపోవడం, తెల్ల జుట్టు లాంటి సమస్యలను కూడా తొలగించి మన జుట్టు ఆకర్షణంగా పొడవుగా పెరిగే టట్లు చేస్తాయి. ఆవనూనెలో ఓమేగా 3 యాసిడ్స్ తోపాటు ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఈ రెమిడి తయారీ విధానం
- ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల మెంతులను వేయండి
- ఇందులో ఇప్పుడు ఒకటి నుండి ఒకటిన్నర స్పూన్ల కలోంజి విత్తనాలు వేసుకోండి
- ఇప్పుడు వీటిని మెత్తని పొడిలా చేసుకోండి. ఈ పొడిని ఒక చిన్న బౌల్ లోకి తీసుకోండి
- ఈ బౌల్ లో ఒక 20 ml ఆవనూనెను కలపండి. మీకు ఒకవేళ ఆవనూనె పడకపోతే కొబ్బరినూనె అయినా ఇందులో కలుపుకోవచ్చు
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాలు డబుల్ బాయిలింగ్ పద్ధతిలో లో వేడి చేయాలి. అంటే ఈ ఆయిల్ ను నేరుగా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు. ఒక వెడల్పాటి పాన్ తీసుకుని అందులో నీటిని పోసి వేడి చేయాలి.
- తరువాత ఆయిల్ బౌల్ ని స్టవ్ మీద ఉన్న ప్యాన్ లో పెట్టి నూనెలో కొద్దిగా నురుగు వచ్చేంత వరకు వేడి చేయాలి
తర్వాత ఈ నూనెను 3 నుంచి 4 గంటల వరకు అలాగే ఉంచండి. దీనిద్వారా మెంతుల్లోని కలోంజి గింజలు లోని పోషకాలు నూనెలోకి ఇంకో తాయి. తర్వాత ఆయిల్ని వడ పోసి భద్రపరుచుకోండి.
ఈ రెమిడి ఎలా వాడాలి అంటే ..
మీరు తలస్నానం చేయాలనుకున్న ఒక గంట ముందు ఈ నూనెను కొద్దికొద్దిగా తీసుకొని మీ జుట్టు కుదుళ్లకు అప్లై చేయండి. ఒక గంట పాటు అలాగే ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయండి. ఈ రెమిడీ మీరు వాడడం వలన మీ జుట్టు చాలా నల్లగా అవుతుంది. ఈ విధంగా మీరు వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఆయిల్ మీ తలకు ఉపయోగిస్తే మీ జుట్టు రాలడం తగ్గి జుట్టు చిక్కు పడడం, చిట్లిపోవడం, తలలో చుండ్రు లాంటి సమస్యలు తొలగిపోయి మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.