ఆడపిల్లలకు కండపుష్టి, ఎముకపుష్టి ఒకేసారి పెరగాలంటే ఈ డైట్ తప్పకుండా పాటించాలి….

ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన తర్వాత గ్రోత్ అనేది ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్పీడ్ గా ఉంచుతుంది. ఒక కేజీ బరువుకి రెండు గ్రాముల ప్రోటీన్ అందేటట్టుగా చూసుకోవాలి. మరి నూటికి 90 శాతం మంది పిల్లలకి ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుంది. ఈ ప్రోటీన్ వల్లే వాళ్లకి ఎదుగుదల, కండపుష్టి, హార్మోన్స్, ఇమ్యూనిటీ కి సంబంధించిన కణజాలాలు తయారవడం అన్ని దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇలాంటి ప్రోటీన్ కలిగి ఉన్నాయి పుచ్చ గింజల పప్పు, వేరుశనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివి ఎక్కువ పెట్టడం మీల్ మేకర్, సోయా చిక్కుడు ఇలాంటివన్నీ పెట్టడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది.

ముఖ్యంగా ఆడపిల్లలు ఎదుగుదలకి కాల్షియం ఎక్కువ కావాలి. కాల్షియం ఒంటికి పట్టాలన్న, ఎముకలకు చేరాలన్నా విటమిన్-D చాలా అవసరం. అందుకని పిల్లలకి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక నువ్వులు ఉండగాని, వేరుశనగపప్పు ఉండగాని  పెడితే కాల్షియం బాగా వెళుతుంది. ఐరన్ బాగా పెరగాలంటే కాలీఫ్లవర్ కాడలను కూర చేసుకొని తినాలి. ఆకుకూరలు ఎక్కువ పెడితే ఐరన్ తో పాటు క్యాల్షియం కూడా ఎక్కువ వస్తుంది. చిన్న వయసులోనే వెయిట్ పెరిగితే ఓవరీస్ లో నీటి బుడగలు, ఫ్యాటీ లివర్, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే పాలిష్ పెట్టని మిల్లెట్స్ ని తీసుకోవాలి.

ఆడపిల్లలకి ప్రతినెల పీరియడ్స్ రెగ్యులర్గా రావాలన్నా మెయిన్ గా స్ప్రౌట్స్ ఎక్కువగా పెట్టాలి. దీనివల్ల హార్మోన్స్ అన్ని చక్కగా సమతుల్యంగా ఉంటాయి. గర్భవతులకు జింక్ ఫుడ్స్, బి కాంప్లెక్స్ ఫుడ్స్, పోలిక్ యాసిడ్ ఫుడ్స్, కాల్షియం ఫుడ్స్ తినాలి. అన్నం 50% కూరలు 50% ఉండాలి. రెండు కూరలు పెట్టుకుని రైస్ తిన్న తర్వాత ఒక నువ్వులు ఉండగాని, వేరుశనగపప్పు ఉండగాని తింటే మంచిది, మంచి బలం వస్తుంది. సాయంకాలం పూట గర్భవతులు నాచురల్ ఫుడ్ ఎక్కువ తినడం మంచిది. జింక్ ఎక్కువ ఉండే గుమ్మడి గింజల పప్పు, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న అవిసె గింజలు గాని, వాల్ నట్స్ పెట్టాలి.

పొద్దుతిరుగుడు పప్పు, హై ప్రోటీన్ ఎక్కువ ఉండే పుచ్చ గింజల పప్పు ఇలాంటి వాటిని ఉదయం పూట నానబెట్టుకుని సాయంకాలం ఎండు ద్రాక్ష, అంజీర, కిస్మిస్ లాంటివి పెట్టుకుని తినేసి ఫ్రూట్స్ కూడా తినేస్తే  హెల్తీగా ఉంటారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top