బియ్యం రాకముందు అందరూ రాగులు, సజ్జలు, కొర్రలు, వంటివి ఆహారంగా తీసుకునే వారు. బియ్యం వచ్చాక బియ్యం తుఫానులో ఇవన్నీ కొట్టుకుపోయాయి. సజ్జలు రాగులు వంటివి పశువులు తినే దాన కింది ఇప్పుడు భావిస్తున్నారు. పూర్వం రోజుల్లో సజ్జల అప్పాలు, సజ్జల రొట్టెలు, సజ్జల సంకటి వంటివి ఉండేవి. ఈరోజుల్లో సజ్జలు వాడకం మళ్లీ ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 100 గ్రాముల సజ్జలలో 346 క్యాలరీల శక్తి ఉంటుంది. దగ్గర దగ్గరగా బియ్యంలో కూడా అంతే ఉంటాయి. కానీ బియ్యంలో 77 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
కానీ సజ్జలలో 61 గ్రాములే ఉంటుంది. కనుక బియ్యంతో పోలిస్తే సజ్జలు లో కార్బోహైడ్రేట్స్. కానీ సజ్జలలో కాంప్లికేటెడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బియ్యంలో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మరియు సజ్జలలో 11 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ 11.5 గ్రాములు ఉంటుంది. ఇవి బీపీ, షుగర్ రాకుండా ఉండడానికి, బరువు పెరగకుండా ఉండడానికి సహాయ పడతాయి. మరియు 5 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది. అందువలన అన్ని లాభాలు ఉన్న పోషకాలు ఈ సజ్జలలో ఉంటాయి. తేలికగా అరిగేవి అన్ని తొందరగా గ్లూకోజ్ ను ఫార్మ్ చేస్తాయి. దీనివలన షుగర్ వస్తుంది.
అదే సజ్జలలో ఉండే కార్బోహైడ్రేట్స్ అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాబట్టి స్లోగా అరుగుతాయి. స్లోగా రక్తంలోకి చేరుతుంది. కనుక రక్తంలో చక్కెర పెరగడానికి కొవ్వుగా మారడానికి ఇది కారణం కావు. అందువలన సజ్జలు తింటే మన సమాజంలో సగం మందికి షుగర్ రాదు. మరియు సజ్జల్లో ఉన్న 5g ఫ్యాట్ అన్సర్చులెటడ్ ఫ్యాట్. ఇది కూడా లోపలికి వెళ్ళిన తర్వాత స్లోగా డైజెస్ట్ అవుతుంది. మరియు గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో లెగ్నేనా అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది రక్తనాళాల్లో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది.
ఇవి మలబద్ధకాన్ని, క్యాన్సర్ని రానివ్వవు. మరియు స్లోగా అరగడం వలన త్వరగా ఆకలి వేయదు. మరియు గాల్బ్లాడర్ సమస్యలు రాకుండా చూస్తుంది. వీటిని కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు. ఇవి రాకుండా సజ్జలు చూసుకుంటాయి. మరియు వాటిని రెగ్యులెట్ చేస్తాయి. ఇలాంటివన్నీ సజ్జలు వల్ల కలిగే లాభాలు. కనుక వీటిని మెత్తగా నములుకుని తింటే త్వరగా అవుతాయి. వీటిని ఏ వయసు వారు అన్న తీసుకోవచ్చు. బరువు, షుగర్ తగ్గాల్సిన వారు వీటిని రోట్టెల రూపంలో గాని దోసెలగా గాని వేసుకుని తినవచ్చు…