ప్రస్తుత అందరికీ ఆర్థరైటిస్ రావడం, కీళ్ల మధ్య లో గుజ్జు వెళ్ళిపోవడం, మోకాళ్ళ నొప్పులు , కార్టిలేజ్ దెబ్బతిని జిగురు పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి, సాల్ట్ ఎక్కువగా తినడం, వ్యాయామం సరిగా చేయకపోవడం. ఇన్ఫలమేషన్ పెరిగిపోవడం వలన నిదానంగా కొన్ని హానికలిగించే ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి కార్టిలేజ్ డామేజ్ చేయడం, పగిలి పోయేటట్లు చేయడం వంటివి జరుగుతాయి.
కార్టిలేజ్ దెబ్బతినకూడదు జిగురు ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలన్నా, ఎముకలు గ్రీజు పెట్టినట్లు ఫ్రీగా మూవ్ అవ్వాలన్న, కార్టిలేజ్ జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దానిమ్మ అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానిమ్మలో ముఖ్యంగా క్యూనిక్ కేటాజిన్స్ మరియు క్యూనిక్ ఆసిడ్ అని రెండు రకాల కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్‌గా కలిగి ఉంటాయి. రెండు రకాల కెమికల్ కాంపౌండ్స్ ఎముకల దగ్గర కార్టిలేజ్ భాగంలో హానికలిగించే ఎంజైమ్స్ ను నిరోధించడానికి అద్భుతంగా సహాయపడుతాయి.
కార్టిలేజ్ దెబ్బతినకుండా, ఎముకల మధ్య ఉండే జిగురు పదార్థం అరిగిపోకుండా ఉండాలి అంటే దానిమ్మ ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. కార్టిలేజ్ బాగుంటే ఎముకలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇటువంటి ప్రయోజనాలన్నీ మీకు కూడా కలగాలి అంటే దానిమ్మ ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. వీలైనంతవరకు సాల్ట్ ను ఉపయోగించడం తగ్గించేయాలి. ఎంత తగ్గిస్తే అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. కార్టిలేజ్ దెబ్బతినడం తగ్గుతుంది.
ఒంట్లో నీటి శాతం కూడా తగ్గుతుంది. కుర్చీ, బళ్ల మీద చేసే వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. దానిమ్మ గింజలను నమిలి మింగడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి కార్టిలేజ్ దెబ్బతినకుండా చేస్తాయి. ఈ విషయాన్ని సైంటిఫిక్ గా నిరూపించిన వారు 2005వ సంవత్సరం కేస్ వెస్ట్రన్ యూనివర్సిటీ USA వారు. అందుకే దానిమ్మ ప్రతి రోజు ఉపయోగించడం మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తప్పనిసరిగా తీసుకోవాలని నిరూపించబడినది.
ఏ సమస్య లేని వారు రాకుండా మాకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకున్నవారు దానిమ్మ ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దానిమ్మ గింజలను నమిలి తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఇటువంటి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దానిమ్మ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానిమ్మ గింజలను తీసుకోవడం అలవాటుగా మార్చుకోండి.