ముఖం కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ మనం తిరిగే వాతావరణం, వాడే నీళ్లు ఇవన్నీ ముఖాన్ని కాలుష్యంతో, దుమ్ము, ధూళితో నింపేసి జిడ్డుగా, రకరకాల మచ్చలు, మొటిమలు, అక్కడక్కడా నల్లగా మారిన చర్మంతో చూడడానికి ఇబ్బందిగా తయారు చేస్తుంది. కానీ వీటిని తొలగించుకోవడానికి ప్రతిసారి పార్లర్కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోలేం. ఇంట్లోనే వీటిని తగ్గించుకునేందుకు ఒక మంచి హోం రెమడీ అందుబాటులో ఉంది. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంచి ఫేస్ ప్యాక్.
దాని కోసం మనం ఒక గిన్నె తీసుకొని దానిలో ఒకటిన్నర స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఈ సెనగపిండి ముఖాన్ని టైట్ గా చేయడంలోనూ, గీతలు ముడుతలు రాకుండా అడ్డుకోవడంలోనూ చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ముఖంపై ఉండే మచ్చలు తొలగించి ముఖాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. దీనిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. అలోవెరా జెల్ ముఖాన్ని తేమగా చేసి పొడిబారే సమస్య నుంచి కాపాడుతుంది. చర్మంపై పగుళ్లు ఏర్పడకుండా తేమగా, కాంతివంతంగా మృదువుగా చేస్తుంది. మచ్చలు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
తర్వాత పదార్ధం నిమ్మరసం. ఒక నిమ్మచెక్క తీసుకొని కొన్ని చుక్కలు నిమ్మరసం ఇందులో పిండుకోవాలి. నిమ్మకాయ ముఖంపై బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి ముఖాన్ని బ్రైట్ గా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా, బ్యాక్టీరియా రహితంగా చేసి మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే అరస్పూన్ తేనె కూడా వేసుకోవాలి. తేనె మొటిమలు తగ్గించడానికి, ముఖం చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, తేమగా ఉండటానికి సహాయపడుతుంది. ఇప్పుడు దీనిలో అసలైన పదార్ధం బీట్రూట్ రసం వేసుకోవాలి. బీట్ రూట్ మను పొట్టుతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ ను వడకట్టి తీసుకున్న రసాన్ని రెండు స్పూన్లు ఈ పిండిలో వేసుకోవాలి. అలాగే పచ్చి పాలు లేదా పాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. పాలపొడి గరుకుగా ఉండే చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేస్తుంది. బీట్రూట్ మంచి రంగు ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత మామూలు నీటితో కడిగేసుకోవాలి. కనీసం ఐదు రోజులపాటు ఈ ప్యాక్ ను అప్లై చేస్తుంటే అనీవెన్ స్కిన్ ఈవెన్గా మారుతుంది. చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.