ఎండలోకి వెళ్ళినప్పుడు బట్టలు కప్పనిచోట నల్లగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులు, పాదాలు నల్లగా మారతాయి. ఆ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వలన మృతకణాల్ని తొలగించి తెల్లగా మార్చుకోవచ్చు. దానికోసం కొన్ని బాదంపప్పులను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే వీటి పై పొర తీసేసి మిక్సీలో కొద్దిగా నీటిని చేర్చుతూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ అలొవెరా జెల్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కావాలంటే వారం వరకూ ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ని ఏదైనా హోం మేడ్ స్క్రబ్ ఉపయోగించిన తర్వాత ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత మామూలు నీటితో కడిగేయాలి. ఇలా కనీసం వారంలో రెండు సార్లు చేయడం వలన ముఖంపై పేరుకున్న నల్లదనం తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. బాదం స్కిన్ టాన్ తగ్గించడానికి చాలా బాగా తోడ్పడుతుంది. బాదం యొక్క మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే మృతకణాల్ని తొలగించి కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా టాన్ ను తగ్గించగల సామర్థ్యం మరియు చర్మరంగును మెరిపించే గుణం అధికం.
అలొవెరా జెల్ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడానికి తోడ్పడుతుంది. ఆలివ్ ఆయిల్ చర్మం కోల్పోయిన సహజ నూనెలను అందించి చర్మాన్ని తేమగా మార్చుతుంది. చర్మం పొడిబారకుండా పగలకుండా అడ్డుకుంటుంది దీనితోపాటు మరో చిట్కా కూడా చర్మం పై టాన్ ను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. దానికోసం రెండు టమాటాలను మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిలో ఒక ఫోన్ అలోవెరా జెల్ వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వాడడం వలన చర్మంపై పేరుకున్న టాన్, మురికి, దుమ్ము ధూళి, జిడ్డు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు ఈ ప్యాక్ ను తరచూ వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వారంలో కనీసం రెండు సార్లు ఉపయోగించవచ్చు. వీటిలో వాడిన పదార్థాలన్నీ సహజంగా దొరికేవే కనుక తక్కువ ఖర్చు తో ఎటువంటి దుష్ప్రభావాలు లేని మంచి ఫేస్ ప్యాక్ లు రెడీ అయిపోతాయి.