ప్రతి ఒక్కరూ రోజు మొదలైనప్పటి నుండి రాత్రి పడుకునే అంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. రోజంతా పని చేసి రాత్రయ్యేసరికి అలసిపోయి చాలా నీరసించి పోతారు. నీరసం తగ్గడం కోసం ఎన్ని చేసినా నీరసం తగ్గదు. హాస్పిటల్ కి వెళ్లి ఇంగ్లీష్ మందులు ఉపయోగించినప్పటికీ ప్రయోజనం ఉండదు. ఒకసారి ఈ డ్రింక్ తయారు చేసుకొని వాడినట్లయితే నీరసం తగ్గి రోజంతా యాక్టివ్గా ఉంటారు. దీనికోసం ముందుగా 8 వెల్లుల్లి రెబ్బలను కిచెన్ రోలు లో వేసి మెత్తగా దంచుకోవాలి.
తర్వాత ఒక గ్లాస్ మామూలు నీళ్లను తీసుకోవాలి. ఈ నీటిలో మనం ముందుగా దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. లవంగాలు ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ నీటిలో పావు చెంచా లవంగాల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక అర గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అరగంట తరువాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ నీటిని ఒకసారి వడకట్టుకోవాలి.
వడ కట్టుకున్న నీటిలో ఒక చెంచా తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ నీటిని భోజనం చేసిన తరువాత పడుకోవడానికి ఒక అరగంట ముందు తాగాలి. ఇలా చేసినట్లయితే నీరసం తగ్గి ఉదయాన్నే చాలా యాక్టివ్ గా ఉంటారు. రోజంతా పని చేసిన ఎటువంటి నీరసం ఉండదు. నీరసం తగ్గించి రోజంతా యాక్టివ్ గా ఉండడం లో ఈ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం పని చేసే సరికి అలసిపోతున్నాను అనుకునేవారు ఒకసారి ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ డ్రింక్ తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఈ డ్రింక్ నీరసం తగ్గించడమే కాకుండా శరీరంలో అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తగ్గిస్తుంది. ఈ డ్రింక్ త్వరగా అలసిపోయే ప్రతి ఒక్కరు తాగావచ్చు. రోజంతా పని చేసి అలసిపోయి మరుసటి రోజు ఉదయం లేవలేకపోతున్నాం అనే వారు కూడా ఈ డ్రింక్ తాగితే ఉదయాన్నే ఎనర్జిటిక్ గా ఉంటారు. రోజంతా పనులన్నీ యాక్టీవ్గా చేసుకోగలుగుతారు. మీకు అవసరం అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది.