మామిడి పండు తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ 3 పదార్ధాలు తినకండి మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్

ఎండాకాలం వచ్చిందంటే అందరూ చిరాకు పడతారు.అయితే  ఈ కాలంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ వేసవి కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. దానికి కారణం మామిడిపండు. మంచి రుచితో పాటు చూడగానే ఆకర్షించే రూపం తో అందర్నీ మామిడిపండు తన వైపు లాక్కుంది. అలాంటి మామిడిపండును అన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. అలా తీసుకోవడం వలన కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండు జ్యూస్ తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. ఎండాకాలంలో వీటి కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. అందుకే వీటిని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు. అంటే పండ్లకే రారాజు  అంటారు. ఒక్కో సమయంలో డయాబెటిక్ పేషెంట్లు కూడా మనసు చంపుకోలేక వీటిని తినేస్తుంటారు.అంతగా ఆకర్షిస్తాయి మామిడి పండ్లలో ఎన్నో న్యూట్రియంట్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మామిడి పండులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది.ఇది మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది ఎన్నో వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. మామిడి పండు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది..ఫెర్టిలిటీ ని పెంచుతుంది ఇంత రుచిగా ఉండే పండ్లను మితంగానే తీసుకోవాలి. ఇంతకీ వీటితో తీసుకోకూడని పదార్ధాలు ఏంటో మీకు తెలుసా.

అందులో మొదటిది కాకరకాయ. డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయ జ్యూస్ కూడా తాగుతుంటారు. చేదుగా ఉండే కాయ అనేక ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది. మామిడిపండు తిన్న వెంటనే కాకరకాయ తినడం వలన మీకు వాంతులు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊపిరి ఆడకపోవడం శ్వాస సంబంధ సమస్యలు వికారం ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాకరకాయ తిన్నప్పుడు లేదా కాకరకాయ జ్యూస్ తాగినప్పుడు మామిడిపండు తినకూడదు. అలాగే మామిడికాయ తిన్నప్పుడు తీసుకోకూడని మరొక పదార్థం మిరపకాయలు. మామూలుగా అయితే పచ్చిమిర్చి తిన్నప్పుడు మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది.

ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది కంటి చూపుకు చాలా మంచిది. కొంతమంది కారంగా ఉండే ఆహారం వండినప్పుడు లేదా పెరుగు అన్నంలో కూడా తింటూ ఉంటారు. అలా తినడం వల్ల నష్టం లేదు. కానీ మామిడి పండ్లతో కలిపి తినడం వల్ల మామిడి పండ్లు తీయగా ఉండడం, పచ్చిమిర్చి కారం గా ఉండడం వలన రెండు విరుద్ధ ఆహారాలు. దీని వలన కడుపులో ఎసిడిటీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి మామిడి పండ్లు తినడం వలన గొంతు సంబంధిత సమస్యలు వస్తాయి.

దీనికి కారణం మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం.చల్లని నీళ్ళు లేదా ఫ్రిజ్ వాటర్ తాగకూడదు.మామిడి పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఇది గొంతులో చికాకును కలిగిస్తుంది. మామిడి పండ్లు తినడం వల్ల ఒక సారి పెదవులుపై చిన్న చిన్న కురుపులు వస్తాయి. పచ్చిమామిడిలోఉండే జీడివలన ఇలా రావచ్చు దీని వలన దురద, వాపు ఉంటుంది. ఆర్థరైటిస్కు బాధపడేవారు, కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా మామిడి పండు ఎక్కువ తినకూడదు. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువ స్థాయిలో ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది శరీరంలో రక్త చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top