ప్రస్తుతం యువత పార్టీ, ఫ్రెండ్స్ తో సరదాగా గడపడం అని రకరకాల జంక్ ఫుడ్స్, చాకోలెట్స్, కూల్డ్రింక్స్, బజ్జి, పానీపూరి, ఫాస్ట్ ఫుడ్స్ అని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. గతంలో అంటే 40-50సంవత్సరాల క్రితం ఇలా బయట ఆహారాలు తినడం ఉండేది కాదు.వాళ్ళు తినాలి అనుకున్న డబ్బులు కూడా ఉండేవి కాదు. అందువలన వాళ్ళు ఎక్కువగా ఇంట్లో చేసిన ఆహారపదార్దాలనే తినేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో వండిన ఆహారపదార్దాలు మొత్తానికి తినడం మానేసి బయట తినే ఆహారపదార్దాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు.
దీనివలన అతి చిన్న వయసులోనే బీపీ,షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులో యువత అనేక అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. గతంతో పోల్చికుంటే ఇప్పుడు మరణాల రేటు ఎక్కువగా యువతలోనే కనిపిస్తుంది. ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ వాళ్ళ మాట వినరు. అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత మీతో పాటు మీ తల్లిదండ్రులను కూడా బాధ పడుతూ ఉంటారు.
ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే. 60 రోజుల పాటు రోజు మొత్తం కాకుండా కనీసం రోజుకు ఒక పూట అయినా మంచి ఆహారం తీసుకుంటే మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ ఆహారంలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కాకుండా నేచురల్ ఫుడ్ తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలను రాకుండా కాపాడుకోవచ్చు. పుచ్చ పప్పు, గుమ్మడి పప్పు, పొద్దుతిరుగుడు గింజలు డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్, అంజీర్, వాల్ నట్స్, పిస్తా పప్పు మొదలగునవి రోజుకు రెండు మూడు రకాలు ఎండినవి అయితే నానబెట్టుకుని తీసుకోవాలి.
ఫ్రెష్ గా ఉంటే అలా డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అలాగే రెండు మూడు రకాల గింజలను మొలకలు కట్టుకొని తీసుకోవాలి. లేదా అరటి పండు, ద్రాక్ష పళ్ళు, జామ కాయ, ఆపిల్, బొప్పాయి, వాటర్ మిలన్ వంటివి ముక్కలుగా కట్ చేసుకొని కడుపునిండుగా తినాలి. ఈ విధంగా కొద్దిరోజులపాటు తిని జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ తిన్నపుడు ఎలా ఉందో నేచురల్ ఆహారాలు తిన్నప్పుడు ఎలా ఉందో గమనించుకోవాలి. మీకే తేడా తెలుస్తుంది.