మనుషులలో ఆధునికత పెరిగేకొద్దీ ఆహారపు అలవాట్లవలన గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ అనేక శ్వాస సంబంధ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వీటన్నింటికీ ముఖ్యకారణం మలబద్దకం. జీర్ణాశయం ఆరోగ్యం గా ఉంటే శరీరానికి అదే బలం. అదే జీర్ణాశయంలో ఏర్పడే మలబద్దకం వలన శరీరంలో ఉండిపోయిన మలినాలు ప్రేగులలో ఉండిపోతాయి. ఇవి రక్తంతో పాటు ప్రవహించి అంతర్గత అవయవాలలో విషపదార్థాలను, అడ్డంకులను ఏర్పరచుతుంది.
శరీరంలో మలబద్దకం వలన కడుపుబ్బరం , నొప్పి ఏర్పడుతుంది. దానివలన పనిపై ఏకాగ్రత, ధ్యాస ఉండవు. నిద్రకూడా సరిగ్గా పట్టదు. ఎక్కువ రోజులు మలబద్దకం ఉంటే దీనిప్రభావం జుట్టు, చర్మం,ఎముకలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులపై ఉంటుంది. జుట్టు రాలడం, చర్మంపై మచ్చలు మొటిమలు ఏర్పడతాయి.
ఇలా విషపదార్థాలు ఏర్పడడం వలన కిడ్నీలు, లివర్ పాడయి అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. అందుకే మంచి ఆహారం తినడంతో పాటు, కడుపును రోజూ శుభ్రపరుచుకోవాలి. రోజు ఉదయాన్నే ఎవరికైతే కడుపు శుభ్రం అవదో వారికి మలబద్దకం రోజురోజుకు పెరుగుతుంది. ఆడవాళ్ళలో ఈ సమస్య ఉంటే గర్బాశయంపై ప్రభావం చూపుతుంది.
దీని ప్రభావం వలన సంతానోత్పత్తి క్షీణిస్తుంది. మలబద్దకం తగ్గించుకుని అవయవాలను సహజంగా ఎలా శుభ్రపరుచుకోవాలో తెలుసుకుందాం. ఒకగిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు వేసి కొంచెం గోరువెచ్చగా అయ్యాక అందులో ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. చిన్నమంటపై నాలుగు నిమిషాలు నీటి రంగు మారేవరకూ మరిగించాలి. జీలకర్రలో అనేక పోషకాలు ఉంటాయి.
మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, పాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఏ, భాస్వరం అధికంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరాన్ని ఆరోగ్యం గా ఉండేలా చేస్తాయి. ఈ నీటిని గోరువెచ్చగా అయ్యాక వడకట్టి అందురో అరచెంచా నిమ్మరసం కలపాలి. అలాగే బ్లాక్ సాల్ట్ చిటికెడు వేయాలి. మీరు తీపిదనం కోసం తేనె కలుపుకోవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు తేనె బదులు బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఈ నీటిని ప్రతిరోజూ పడుకునేముందు తీసుకోవాలి. ఇలా రోజూ తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకుపోతాయి. టాక్సిన్లు బయటకు వెళ్ళిపోతే శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. ఈ నీటివలన మలబద్దకం తగ్గి మలినాలు బయటకు పోతాయి.
ఇందులో ఉండే ఐరన్ వలన రక్తహీనత తగ్గి ఎనీమియా వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అధికబరువు సమస్యకు మంచి ఔషధం. ఈనీటిని తాగడంవలన కొవ్వులు కరిగించి బరువు తగ్గుతుంది. నిమ్మరసం వలన మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది.
జీవక్రియ పనితీరు బాగుంటుంది. ఊబకాయంతో బాధపడుతున్నవారు రోజూ ఈ టీని తీసుకోండి. కడుపుబ్బరం ఉన్నప్పుడు, దగ్గు ఉన్నప్పుడు ఈ టీని అప్పటికప్పుడు చేసుకుని తాగడంవలన మంచి ఫలితం ఉంటుంది. జీలకర్ర ఊపిరితిత్తులలో పేరుకున్న కఫాన్ని కరిగిస్తుంది. కాలేయం, మూత్రపిండాలు శుభ్రపడి ఆరోగ్యంగా ఉండొచ్చు.