జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత, నడుం నొప్పి మరియు మీ వెన్నులో, కీళ్ళలో నొప్పి అసలైన కారణం మీ శరీరంలో వాత దోషం అనగా వాయువు అంటే గ్యాస్ బాగా పెరిగిపోయింది అని అర్థం. నరాలు బలహీనపడి మలబద్ధకం గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఈ అనారోగ్యాల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ అనేక ప్రదేశాలు చేరి అక్కడ తిష్ట వేస్తుంది. ఈ గ్యాస్ను ఎముకల మధ్య చేరిపోతే అక్కడ ఉండే లూబ్రికెంట్ ను వదులు చేసి కీళ్ళు అరిగిపోయేలా చేస్తుంది. దీనివల్ల మనం నడిచినప్పుడు, పరుగెత్తినపుడు, పైకి లేచినప్పుడు ఎముకల నుండి శబ్దాలు వస్తాయి.
కీళ్ల నొప్పులు, వాపులు రావడం జరుగుతుంది. అందుకే దీనిని వాతదోషం అని పిలుస్తారు. అంతేకాకుండా దీనివలన ఆర్థరైటిస్, శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం,చర్మం పొడిబారడం, అనేక ప్రదేశాల్లో నొప్పులు రావడం మరియు అలసట, నీరసం , కడుపు ఉబ్బరం, పక్షవాతం లాంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. వీటన్నిటికీ కారణం వాత దోషం. చర్మం పొడిబారడం సమస్య ఉంటే ఎముకల మధ్యన లూబ్రికెంట్ అరిగిపోవడం, నొప్పి, శబ్దంరావడం తగ్గాలన్న కూడా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆముదం నూనె వేసి అందులో నిమ్మరసం పిండి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఈ డ్రింక్ తాగిన అరగంట లేదా గంట వరకు ఏమి తినకూడదు. అలా చేస్తే మీ శరీరంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వారానికి రెండు సార్లు మాత్రమే ప్రయత్నించాలి. ఒకరోజు తీసుకుని రెండు రోజులు సమయం ఇచ్చి తర్వాత రోజు మాత్రమే తాగాలి. కానీ ఎవరు తీసుకోకూడదు అంటే బీపీ సమస్యలు ఉన్న వారు, గుండె సమస్యలు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చేతల్లులు తీసుకోకూడదు. వారానికి రెండురోజులు ఈ నీటిని తీసుకుంటే ఇది ఎముకల మధ్య లూబ్రికెంట్ ను పెంచుతుంది.
గ్యాస్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఎముకల నొప్పులు తగ్గించే మరో చిట్కా తెలుసుకుందాం. ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచే మలబద్దకం, గ్యాస్ ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. కఫాన్ని తగ్గించి వాత దోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నీటిని స్టవ్ మీద పెట్టి కొంచెం మరిగిన తరువాత ఒక స్పూన్ వాము వేయండి. అలాగే ఒక బిర్యాని ఆకు కూడా వేయాలి కొంత సేపు మరిగేంత వరకు ఉంచాలి. మన జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి గ్యాస్, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. గ్యాస్ పేరుకుపోకుండా చేస్తుంది.
ఈ నీటిని వడకట్టి కొంచెం బెల్లం పొడి కలుపుకొని ని ఉదయాన్నే తాగడం వలన గ్యాస్ను కడుపు నుండి బయటకు పంపించేస్తుంది. సహజమైన చిట్కాలతో మీ కడుపును శుభ్రం చేసుకొని అనారోగ్యాలకు దూరంగా ఉండండి.