మనం ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటుగా మారింది. ప్రస్తుతం అందరు డ్రై ఫ్రూట్స్ తింటున్నారు.వాటిలో మనం కిస్మిస్ కూడా తింటూ ఉంటాము. వీటిని గింజలు లేని కిస్మిస్ లడ్డూలు, పాయసం వంటి వాటిలో ఉపయోగిస్తారు. ఈ కిస్మిస్ కాకుండా గింజలతో కొంచెం పొడవుగా ఉండే కిస్మిస్ ని ముక్కా కిస్మిస్ అంటారు. మిగిలిన కిస్మిస్లతో పోలిస్తే మునక్కా కిస్మిస్ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో స్పెషల్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. 100 గ్రాముల మునక్కా కిస్మిస్ లో 744 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది.
పొటాషియం ఉండడం వల్ల మన శరీరంలో రక్తనాళాలు వ్యాకోచం పెరుగుతుంది. రక్తనాళాలు ముడుచుకుపోయి గుణం తగ్గుతుంది. గుండె కండరాలు కూడా రిలాక్స్ కావడానికి మునక్కా కిస్మిస్ చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది గుండె జబ్బులు రాకుండా రక్షిస్తుంది అని సైంటిఫిక్ గా నిరూపించిన వారు 2019 వ సంవత్సరం ఎమిటీ యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ, నోయిడా వారు భారతదేశంలోని పరిశోధనలు జరిపి నిరూపించారు.
మునక్కా కిస్మిస్ వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరేడ్స్ వంటివి తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే మునక్కా కిస్మిస్ గుండెజబ్బులు రాకుండా రక్షిస్తుంది. పదిహేను రోజుల పాటు రోజుకు 15 చొప్పున తిన్నా సరే పదిహేను రోజుల్లోనే దీని ప్రభావం చూపిస్తోందని పరిశోధనలో నిరూపించబడినది. వీటిని ఇలా డ్రై గా తినవచ్చు లేదా నానబెట్టుకుని కూడా తినవచ్చు. ఎక్కడికైనా ప్రయాణంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఈజీగా తినడానికి బాగుంటాయి.
కొన్ని డబ్బాలో లేదా ఏదైనా జిప్ బ్యాగ్ లో వేసుకుని వెళితే ఆకలి అయినప్పుడు ఫ్రూట్స్ లేదా వీటిని ఈజీగా తినవచ్చు. మునక్కా కిస్మిస్లో ఫైబర్ 7 గ్రాములు ఉంటుంది.పేగులకు, హెల్ప్ ఫుల్ బాక్టీరియా కు చాలా మంచిది. దీనిలో SOD SOD అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్పెషల్గా లివర్ డిటాక్సిఫికేషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి పెద్ద వయసు వారికి నమల లేరు కాబట్టి వారికి నానబెట్టి కూడా పెట్టవచ్చు.
నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఈ నీటిని తాగడం వల్ల గాలి గొట్టాలులో ఉండే శ్లేష్మం వంటివి తగ్గుతాయి. దీనివల్ల గాలి గొట్టాలలో గాలి ఫ్రీగా తిరుగుతుంది. మనం ప్రతిరోజు డ్రై నట్స్ నానబెట్టుకుని తింటూ ఉంటాము వాటిని ఉత్తిగా తినడం వల్ల వెగటగా అనిపిస్తాయి వాటితో పాటు వీటిని నంచుకుని తినడం వలన నోటికి రుచిగా ఉంటాయి. ప్రతిరోజు వీటితో పాటు నాలుగైదు బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ వంటివి కూడా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.