డాక్టర్లు ఆశ్చర్యం కోబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే మీజుట్టు ఒత్తుగా పొడువుగా పెరుగుతుంది

చుండ్రు, కాలుష్యం, శరీరానికి తగిన పోషకాహారం అందకపోవడం, అనారోగ్య సమస్యలు వలన జుట్టు రాలిపోవడం అనేది పెద్ద సమస్య గా మారిపోయింది నేటిరోజుల్లో. మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపూలు వాడి విసిగిపోయిన వారికి అద్బుతమైన పరిష్కారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండే ఔషధమొక్క కలబంద. పచ్చని రంగు, ముళ్ళుతో ఉండే ఈ మొక్క అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతూనే ఉంది.

దీనిలో జిగురుగా ఉండే గుజ్జుని తలకు పట్టిస్తే జుట్టు మెత్తగా మెరుస్తూ ఉంటుంది. కానీ ఈ పద్దతిలో రాయడం, కడగడం చిరాకుగా ఉండొచ్చు. అదే లాభాలను అందించే మరో పద్దతి తాజా కలబంద ఆకులను  తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి అరకప్పు కొబ్బరి నూనెలో వేసి రెండు నిమిషాలు మీడియం మంటమీద మరిగిస్తే కలబందలో ఉండే పోషకాలను నూనె సంగ్రహిస్తుంది. ఆ నూనెను చల్లారిన తర్వాత వడకట్టి అందులో రెండు విటమిన్ ఇ టాబ్లెట్స్ వేసి కలపాలి.

తర్వాత ఒక శుభ్రమైన బాటిల్లో వేసుకోవాలి.  ఈ నూనెను తలలో కుదుళ్ళకు పట్టేలా రాసుకుని ఆ రాత్రంతా ఉంచి ఉదయాన్నే తలకు స్నానం చేస్తే తలలో ఉండే చుండ్రు, చిన్న చిన్న కురుపులు తగ్గిపోతాయి. తల కుదుళ్ళ వరకూ మర్దనా చేయడం వలన రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు రాలడం తగ్గడమే కాకుండా కొత్త జుట్టు వస్తుంది. పీచులా ఉండే జుట్టును మెత్తగా చేయడంలో కలబంద చాలా బాగా సహాయపడుతుంది. నల్లగా, పొడవుగా పెరగడానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. రాత్రంతా ఉంచుకోలేని ఎడల రాసుకున్న రెండు, మూడు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ నూనెను తయారు చేసి పెట్టుకుంటే చాలారోజుల వరకూ నిల్వ ఉంటుంది. కలబందను చర్మ, కేశ సంరక్షణలో వాడేటపుడు కలబందను చెట్టునుండి కోస్తే పసుపుగా ఉండే జిగురు పదార్థం లాంటిది వస్తుంది. ఇది చర్మానికి, తలకు తగలకుండా జాగ్రత్తపడాలి. ఇది చర్మానికి తగిలితే ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కలబంద వాడినపుడు ఏమైనా దద్దుర్లు, దురదలాంటివి వస్తే వెంటనే చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. కలబంద వాడకం మానేయడం మంచిది. మీ శరీరానికి కలబంద పడలేదని అర్థం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top