చిటికెడు తింటే చాలు.శరీరంలో పొట్టచుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది..

మన శరీరం రెండు సమయాల్లో చాలా తొందరగా బరువు తగ్గుతుంది . ఒకటి పడుకునేటప్పుడు తగ్గుతుంది. రెండు వర్కౌట్ చేసేటప్పుడు బరువు తగ్గుతుంది. నిద్ర పోయేటప్పుడు బరువు తగ్గాలంటే ఎక్కువ ఆహారం తీసుకోకూడదు పడుకునేముందు.  నిద్రపోయే ముందు కొన్ని ఆయుర్వేద చిట్కాలు వాడాలి. పడుకోవడానికి రెండు,మూడు గంటల ముందు భోజనం చేయాలి. అలాంటి వారి శరీరం మీద బరువు తగ్గడానికి వాడే ఏ చిట్కాలు అయినా బాగా పనిచేస్తాయి. ఇలా చేయడం వల్ల చాలా తొందరగా బరువు తగ్గవచ్చు. ఈ చిట్కా కోసం మనం ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి.

దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం మరియు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. దీని కోసం కావలసిన పదార్థాలు సోంపు, పసుపు, అవిసె గింజలు, జీలకర్ర, కరివేపాకు, కరక్కాయ, సైంధవ లవణం, ఇంగువ ఇవన్నీ బయట ఆయుర్వేద షాపుల్లో సులభంగా లభిస్తాయి. ఏవైనా పదార్థాలు దొరకని ఎడల మిగిలిన ళవాటితో ఈ చిట్కా పాటించండి. ఇందులో వాడే సోంపు, జీలకర్ర , కరక్కాయ తప్పకుండా వాడాలి. కరక్కాయ పౌడర్ ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటుంది. సోంపు, జీలకర్ర, ప్రతి కిరాణా షాప్ లో దొరుకుతుంది.మీ దగ్గర త్రిఫలచూర్ణం అందుబాటులో ఉంటే కరక్కాయ బదులు అది కూడా వాడుకోవచ్చు.

జీర్ణ వ్యవస్థ చాలా మెరుగ్గా పని చేస్తుంది. తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువ తినేవారు కరక్కాయ తప్పకుండా వాడాలి. ఇది మన మెటబాలిజంరేట్ ని, ఇమ్యునిటీ సిస్టంని కాపాడుతుంది. దీనివల్ల పొట్ట ప్రాంతంలోని కొవ్వు చాలా సులువుగా కరిగిపోతుంది. దీని కోసం తీసుకున్న పదార్థాలు అవిస గింజలు, జీలకర్ర, సోంపు కొంచెం తక్కువ మంటపై  వేయించుకోవాలి. దీని కోసం 25 గ్రాములు అవిస గింజలు తీసుకొని వేయించుకోవాలి.తర్వాత తీసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి.తక్కువ మంటపై మాత్రమే వేడి చేసుకోవాలి. ఎక్కువ వేడి చేయడం వలన మాడిపోయి అందులో ఉండే పోషకాలను కోల్పోతాయి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి.

అందులోనే 25 గ్రాముల కరక్కాయ పౌడర్, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సైంధవలవణం, వేసుకోవాలి. సైంధవ లవణం అందుబాటులో లేకపోతే  నల్ల ఉప్పు వాడుకోవచ్చు. చిటికెడు ఇంగువ 25 గ్రాములు కరివేపాకు పొడి వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ శరీరంలో పేరుకొన్న కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. వీటన్నిటిలో దొరికే ఫైబర్ ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మారుస్తుంది. కొవ్వుగా మారకుండా అడ్డుకుంటాయి. దాని వలన శరీరంలో బరువు అనేది తగ్గుతుంది. ఈ పొడిని రోజూ తీసుకోవడం వలన మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. వ్యాయామంతో పాటు ఈ పౌడర్ కూడా తీసుకుంటూ ఉంటే త్వరలోనే మంచి శరీర సౌష్టవం మీ సొంతమవుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top