బెల్లంతో సౌందర్యమా ? ఎలా?

బెల్లంలో ఎన్నో పోషకాలు అలానే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఫ్రీ ర్యాడికల్స్ పై పోరాడి ఏజింగ్ ని ఆపుతుంది. బెల్లం ముఖం పైన వచ్చే డార్క్ స్పాట్స్ మరియు బ్లేమిషెస్ ను సమర్థవంతంగా తగ్గిస్తుంది. విటమిన్ సి, ఐరన్ కారణంగా రఫ్ హెయిర్ స్మూత్ గా మారడమే కాకుండా.. హెయిర్ గ్రోత్ దృడంగా మారుతుంది.

ఇన్ని మంచి గుణాలున్న బెల్లాన్ని మన డైలీ బ్యూటీ రొటీన్ లో ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం

1. బెల్లంతో -మెరిసే చర్మం

బెల్లంలో దొరికే గ్లైకోలిక్ యాసిడ్ అనేది చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.

దీనికి కావాల్సిన పదార్ధాలు

  • బెల్లం పొడి- 2 టేబుల్ స్పూన్లు
  • తేనే- 2 టేబుల్ స్పూన్ల
  • నిమ్మరసం రెండు చుక్కలు

వాడే విధానం

రెండు స్పూన్ల బెల్లం పొడిలో రెండు స్పూన్ల హనీని కలుపుతూ.. రెండు చంచాల నిమ్మరసాన్ని పోసి.. బాగా కలుపుకోవాలి.ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుగుకొని, ఈ పేస్ట్ ను రాసుకోవాలి. ఒక పది నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే, ముఖంలో కాంతి రావడం,అటు మొటిమలు మరియు యాక్నే మాయం అవ్వడం ఒకేసారి జరుగుతాయి.

2. బెల్లంతో – సిల్కీ హెయిర్

బెల్లంలో లభించే విటమిన్ సి అనేది హెయిర్ ను స్మూత్ గా, సిల్కీగా అలానే దృఢంగా మారుస్తుంది.

దీనికి కావలసిన పదార్థాలు

  • బెల్లం పొడి- 2 టేబుల్ స్పూన్లు
  • ముల్తానీ మట్టి- 1 టేబుల్ స్పూన్
  • పెరుగు 2 టేబుల్ స్పూన్లు

వాడే విధానం

బెల్లం పొడి, ముల్తానీ మట్టి మరియు తాజా పెరుగును కలిపి ఒక ప్యాక్ గా తయారుచేయండి. ఈ ప్యాక్ ను స్కాల్ప్ పై అలాగే హెయిర్ పై అప్లై చేసి సర్కులర్ మోషన్ లో మసాజ్ చేసుకోండి. పదిహేను నిమిషాల తరువాత నీటితో ప్యాక్ ను కడిగేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top