ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మనం కొన్ని పనులు చేయటం వలన అది దరిద్రాన్ని ఇస్తుందని పెద్దలు నమ్ముతారు. మనం చేసే పనులు మనకు సిరిసంపదలను కలుగ చేయాలి. కానీ మనం చేయకూడని పనులు చేయడం వలన లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి తీవ్ర పేదరికంలో ఉంటామని పెద్దలు అంటూ ఉంటారు. మనం చేసే పనులు మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచి మనం చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందించాలి. మనం తెలిసి తెలియక చేసే పనులు విజయానికి దూరం చేస్తాయి.
అలా చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొంత మంది ఉదయం లేచిన వెంటనే అద్దంలో తమని తాము చూసుకుంటూ ఉంటారు లేదా ఇంట్లో ఒకరిని అదృష్టం భావించి వారి మొహం చూస్తూ ఉంటారు. కానీ ఇది మన ధర్మాలు ప్రకారం నిషేధించబడింది. అద్దంలో మన ముఖం లేదా ఎవరి ముఖం చూడకూడదు. లేచేటప్పుడు భగవంతుని నామాన్ని స్మరిస్తూ కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి. అలా చేయడం వలన రోజంతా మంచిగా ఉంటుంది.
మనం పడుకున్నప్పుడు మన శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఉదయాన్నే లేచి హనప్పుడు అవి వేగం పుంజుకుంటాయి. గుండెపై ఒత్తిడి పడుతుంది. అందుకే లేచేటప్పుడు కుడివైపు తిరిగి లేవాలి. ఉదయం లేచిన వెంటనే గుడి గంటల ధ్వని, శంఖు ధ్వని, గాయత్రీ మంత్రాలు వినడం మంచిది. అలా వినడం వలన మెదడుకు పాజిటివ్ సిగ్నల్స్ అందుతాయి. అందరికీ అందుబాటులో లేనప్పుడు రికార్డ్ చేసుకుని వినవచ్చు. ఉదయం నిద్రలేవగానే నెమలీకలు, కలువ పువ్వు, అందమైన ప్రకృతి దృశ్యాలు కనిపించేలా పడకగదిలో పెట్టుకోండి. అలాగే భగవంతుని ఫోటో, బంగారం, సూర్యుడు, ఆవు దూడ చూసిన మంచిదే.
అలాగే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. బారెడు పొద్దు ఎక్కిన తర్వాత నిద్ర లేచే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఇంటి ఇల్లాలు ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఇల్లు అశుభ్రంగా ఉంటుంది. అందుకే ఇల్లాలు త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం ముగించి దీపం పెట్టాలి. వీలైతే ఆవుకు ఆహారం పెట్టడం వలన కూడా ఇంటికి మంచి జరుగుతుంది. పక్షులకు, జంతువులకు కొద్దిగా ఆహారం, నీటిని ఇవ్వడం వలన మంచి జరగడంతో పాటు ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి.
కొంత మంది ఉదయం లేచిన వెంటనే న్యూస్ పేపరు చదువుతుంటారు. అందులో ఎక్కువగా హింసాత్మక ఘటనలు, నెగిటివ్ వార్తలు ఉంటాయి. ఇవి మన బ్రెయిన్ కు నెగిటివ్ సిగ్నల్స్ పంపి రోజంతా నెగిటివ్గా ఉండేలా చేస్తుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే వార్తలు చదవడం అంత మంచిది కాదు. అలాగే కొంతమంది నిద్రలేచిన వెంటనే కాఫీలు, టీలు తాగుతూ ఉంటారు. దాని వలన శరీరంలో కెఫిన్ పెరిగిపోతుంది. ఇది గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది.
అందుకే ఉదయాన్నే కాఫీ టీలు తాగకూడదు. ఒకవేళ తాగాల్సి వస్తే బ్రష్ చేసి లేదా నోటిని పుక్కిలించైనా తాగాలి. అలాగే ఉదయాన్నే హింసాత్మక జంతువులను చూడటం లేదా గొడవలు పడటం అంత మంచిది కాదు. ఆ ప్రభావం రోజంతటి మీద ఉంటుంది. కొంత మంది భార్య భర్తలు ఉదయం లేచిన వెంటనే శృంగార కార్యకలాపాల్లో పాల్గొనడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది అని అంటారు. ఆ సమయం దేవుడికి పూజలు, స్మరణకు మాత్రమే ఉపయోగించాలి.