వేడి వేడి సాంబార్ లో పొడవాటి మునక్కాయ ముక్కలు కనబడ్డాయంటే మైమరచిపోతాం నమిలి నమిలి పిప్పి మిగలబెట్టేదాకా వదలము. అంత రుచి ఇష్టం అందరికి మునక్కాయలు అంటే. మునగకాయలు మాత్రమే కాకుండా ఆకులు కూడా చాలా బలవర్థకమైన ఆహారం అని చెప్పవచ్చు. శిలీంద్రాలు, బాక్టీరియా, కీటకాల సంహారిణి గా మునగాకు పనిచేస్తుంది. మునగాకులో బీటా కెరోటిన్, కాల్షియం, మాంసకృత్తులు, ఐరన్, పొటాషియం, ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లా మునగాకును వివిధ రకాలుగా వండుకుంటారు. మునగాకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్ లలోనూ, శాస్ స లలోనూ, ఇంకా కారం పొడి లాంటి వివిధ పద్ధతుల్లో ఉపయోగిస్తారు.
వేరు క్రిమిసంహారిగానూ, గనేరియా, సిఫిలిస్ వ్యాధులక్కు మంచి చికిత్సగా ఉపయోగపడుతుంది. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మునగాకు మంచి మందుగా పనిచేస్తుంది. అలాంటి మునగాకు తో అద్భుతమైన చిట్కాలు చూద్దామా….
◆పిల్లల కోసం
కొంతమంది పిల్లలు రాత్రిళ్లు పక్క తడుపుతుంటారు. అలాంటివారికి కప్పుడు మునగాకును కొద్దిగా పెసరపప్పుతో కలిపి కూరగా వండి పెడితే అద్భుత గుణాన్నిస్తుంది.
◆వాతనొప్పుల పరిష్కారానికి
తాజా మునగాకు, ఆముదం రెండింటిని కలిపి ఉడికించాలి. ఇలా ఉకిడికించిన మిశ్రమం ను ఒక బట్టలో వేసుకుని వాత నొప్పులు, కీళ్ల నొప్పులు, బెణుకు నొప్పులు ఉన్న ప్రాంతాల్లో కాపడం పెడితే ఆ నొప్పులన్ని తొందరగా తగ్గుతాయి. అంతేకాదు గొంతుకు రెండువైపులా వచ్చే వాపులు అయిన గవదబిళ్ళలపై ఈ ఉడికించిన మిశ్రమాన్ని చిన్న మూటగా కట్టి గోరువెచ్చగా ఉన్నపుడు పెట్టడం వల్ల గవదబిళ్ళలు తొందరగా తగ్గిపోతాయి.
◆అల్సర్లు, పుండ్లకు
తాజామునగాకు రసాన్ని తీసి శుభ్రమైన బట్టలో వడగట్టి ఆ రసాన్ని తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగుతూ ఉంటే గొంతు సమస్యలు, పుండ్లు, ముఖ్యంగా లివర్ సమస్యలు తొలగిపోతాయి.
ఒక్కసారి ఇటు చూడండి పోషకాల పుట్ట ఇది
◆మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏ కు పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును వాడతారు.
◆మునగాకుతో లభించే కాల్షియం ను మనం రోను వారి వాడే పాలలో ఉన్న కాల్షియం తో పోలిస్తే ముంగలకులోనే ఎక్కువ ఉంటుంది.
◆ మునగాకులో లభించే ప్రోటీన్లు, రోజు వాడే పెరుగులో మనకు లభించే ప్రోటీన్ల కంటే ఎనిమిది రేట్లు అధికంగా ఉంటుంది. అంటే పెరుగు కంటే ఎక్కువ మునగాలులోనే ప్రోటీన్స్ ఉంటాయనేది నమ్మలేని నిజం.
◆అందరికి తెలిసి మనం తినే అరటిపండులా పొటాషియం పాళ్లు ఎక్కువగా ఉంటాయని నమ్మకం ఎక్కువ. అయితే మునగాకులో అరటిపండు లో కంటే ఎక్కువ పొటాషియం ను పొందవచ్చు.
◆ మధుమేహంతో బాధపడేవారు రోజుకు స్పూన్ చెప్పున మునగాకు పొడిని తీసుకోవడం వల్ల చాలా వరకు కంట్రోల్ లో పెట్టవచ్చు.
◆థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.
◆మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది
◆మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి.
◆గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే పిల్లలు పెద్దలు కూడా దీన్ని నిరభ్యరంతంగా తీసుకోవచ్చు.
◆చిన్న పిల్లలు ఉన్న తల్లులకు పాలు తక్కువైనపుడు మునగాకును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పాలు పెరుగుతాయి.
◆ గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. చల్లారిన నీటిలో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు కలిపి తాగడం ద్వారా శ్వాశ సంబంధిత సమస్యలు మాయమవుతాయి.
◆విరేచనాలతో బాధపడేవారికి మునగాకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. మునగాకును దంచి తీసిన రసం నుండి ఒక స్పూన్ మునగాకు రసం తీసుకుని తాజా కొబ్బరి నీళ్లలో ఆ స్పూన్ మునగాకు రసం పోసి తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.
◆మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.
ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. రోజువారి ఆహారంలో మునగాకును భాగం చేసుకుంటే వారిలో కాల్షియం పెరుగుతుంది.
ఇన్ని లాభాలు ఉన్న మునగాకును నిర్లక్ష్యం చేయక అందరూ అనుబాటులో ఉన్నపుడైనా వాడుకుని ఆరోగ్యాన్ని పెంచుకోండి.