అపారమైన ఔషదం కలబంద (అలోవేరా)

అపారమైన ఔషధ గుణాలతో నిండి ఉన్న కలబంద (Aloe Vera )లో ఎ,బి,సి,డి,ఇ వంటి అత్యంత కీలకమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల ఒకటని చెప్పలేం. అందానికి,ఆరోగ్యానికి కలబంద ప్రధమ స్తానంలో ఉంటుంది.

  • శరీరంలోని కొవ్వును,అలానే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించేందుకు కలబందలో ఉన్న లిపాసెస్‌ ఎంజైము పనిచేస్తుంది.
  • ప్రొటెనెస్‌ అనే మరో ఎంజైము ప్రొటీన్లు సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
  •  బ్రాడికీనెస్‌ అనే ఇంకొక ఎంజైము కడుపులోని మంటను అరికట్టడంతో పాటు చర్మాన్ని మృధువుగా మారుస్తుంది.
  • కలబందలో జీర్ణశక్తికి కావలసిన లవణాలు, ఎలిమెంట్లు కూడా కావలసినంతగా ఉన్నాయి. దీనిని తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ చక్కబడుతుంది. అలానే శరీరంలోని వ్యర్థ విషపదార్థాలు సక్రమంగా విసర్జించబడతాయి.
  • కలబందలో ఉండే సలిసైలిక్‌ యాసిడ్‌ రక్తం పలుచగా ఉండేలా చేస్తుంది. ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్‌ ఇంప్లిమెంటరీ. ఈ సలిసైలిక్‌ యాసిడ్‌ వలన చర్మ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
  • కలబందలోని సపోనిన్స్‌ యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్‌లను,నాశనం చేయడంలో కలబంద ఎంతగానో సహకరిస్తుంది.
  • అధ్యయనాల ప్రకారం శరీరానికి కావలసిన 22 యాసిడ్స్‌లో 20 ఈ కలబందలోనే దొరుకుతాయట.దీని ద్వారా ఎసిడిటిసమస్యలు, దీర్ఘకాలిక మలబ్ధకం, కూడా సులువుగా తగ్గించుకోవచ్చు.
  • కలబందలో 12 రకాల క్రిమినాసికాలు ఉన్నాయి. ఇవి గ్యాస్ట్రో సమస్యలు,అలానే కడుపులో నొప్పులను నివారిస్తుంది.
  • లివర్‌ సమస్యలు, గాస్ ,  మధుమేహం, రక్తహీనత, ఎముకల నొప్పులు, జుట్టు రాలడం, ఇలా అనేక సమస్యలకు కలబంద ఒక సరైన పరిష్కారం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top