Best homemade hair growth treatment: ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. 100 మందిలో 90 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం తగ్గించుకొని జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం కోసం (homemade oils for hair growth) మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ ఉపయోగిస్తున్నారు. ఎన్ని ఉపయోగించినప్పటికీ వాటివల్ల ప్రయోజనం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది.
కొన్ని కెమికల్స్ ఉండే ప్రోడక్ట్ ఉపయోగించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఈజీ గా ఇంట్లో ఉండే వాటితోనే(homemade hair growth tips) ఈ నూనెను తయారుచేసుకుని ఉపయోగించినట్లయితే జుట్టు రాలడం, చుండ్రు, పేలు, తెల్ల వెంట్రుకలు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి.
మెంతులు: Home remedies for hair growth
ఒక చెంచా మెంతులు తీసుకోవాలి. మెంతులు జుట్టు రాలడం తగ్గించి కొత్త జుట్టు (thick hair) పెరగడంలో సహాయపడతాయి. అలాగే చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.
Read More: మందార ఆకులతో పాటు ఇది కలపండి చాలు, వారం రోజుల్లో జుట్టు విపరీతంగా పెరుగుతుంది
- కలోంజీ విత్తనాలు ఒక చెంచా తీసుకోవాలి. ఇవి జుట్టు పెరగడంలో (natural hair growth remedies) అద్భుతంగా పని చేస్తాయి.
- కలోంజీ విత్తనాలు తెల్ల వెంట్రుకలు రాకుండా వచ్చిన తెల్ల వెంట్రుకలు నల్లగా అవ్వడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
- రెండింటినీ కలిపి మెత్తగా పొడి లాగా మిక్సీ పట్టుకోవాలి.
- తర్వాత చిన్న కప్పు తో ఒక కప్పు కలబంద మట్ట ముక్కలను తీసుకోవాలి.
- ఒక రెమ్మ కరివేపాకు (curry leaves for hair growth) కూడా తీసుకోవాలి.
- ఒక గిన్నెలో ఒక కప్పు కొబ్బరి నూనె వేసి స్టవ్ మీద పెట్టాలి. నూనె కొంచెం వేడవ్వగానే కలబంద ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి.
- దీనిలో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, కలోంజీ విత్తనాల పౌడర్ ను కూడా వేసుకోవాలి.
- అలోవెరా, కరివేపాకులోని తడి ఇంకిపోయేంతవరకు నూనె మరిగించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- నూనె చల్లారిన తరువాత వడకట్టుకుని ఎయిర్ టైట్ గాజుసీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక నెల నుంచి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది.
మాకు చేసుకోవడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఒకేసారి ఎక్కువగా తయారు చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఈ నూనెను ప్రతి రోజూ అప్లై చేసుకోవచ్చు (DIY hair growth tips) లేదా తలస్నానం చేయడానికి ఒక గంట లేదా రెండు గంటల ముందు అప్లై చేసుకోవాలి.
- తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా హోం మేడ్ షాంపూ తో తలస్నానం చేయాలి.
- నూనె అప్లై చేసుకునేటప్పుడు ఒక సారి గోరు వెచ్చగా వేడి చేసుకొని అప్లై చేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
- ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా చుండ్రు, పేలు, ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతాయి.