బరువు, డయాబెటిస్ తగ్గించే ఔషధం! త్రిఫల చూర్ణం……

త్రిఫల అంటే మూడు ఫలాలు కలిగి ఉన్నాయి అని అర్థం. అవి ఉసిరి, కరక్కాయ, తానిక్కాయ ఈ మూడింటి కలయిక త్రిఫల. ఈ త్రిఫల చూర్ణాన్ని మార్కెట్లో అమ్ముతారు. 100 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకుంటే 52 గ్రాములు కార్బోహైడ్రేట్స్ 38 గ్రాములు ఫైబర్ ఉంటాయి. ఇక ప్రోటీన్స్, ఫ్యాట్ 0 ఉంటాయి. ఈ త్రిఫల చూర్ణంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ఇది ఎలా ఉపయోగపడుతుంది అని రెండు రకాలుగా పరిశోధన చేశారు. బరువు తగ్గడానికి త్రిఫల చూర్ణం ఎలా ఉపయోగపడుతుందని పరిశోధన చేస్తే ఒక 64 మందికి మరొక 64 మంది వెయిట్ పైన పరిశోధన ప్రారంభించిన వాళ్లు 2012లో షాహిద్ యూనివర్సిటీ ఇరాన్ వారు.

వీరిద్దరికీ సమానంగా వ్యాయామం ఇచ్చారు ఇద్దరికీ డైట్ సమానంగా ఇచ్చారు. 64 మందికి ఐదు గ్రాములు త్రిఫల చూర్ణాన్ని ఉదయం సాయంత్రం ఇచ్చారు. మరొక అరవై నాలుగు మందికి త్రిఫల చూర్ణం కాకుండా హెర్బల్ పౌడర్ ఇచ్చారు. మూడు నెలల పాటు ఇదే విధంగా ఇస్తే త్రిఫల తీసుకున్నవారు 64 మంది త్రిఫల చూర్ణం తీసుకోలేని 64 మంది కంటే ఐదు కేజీలు బరువు తగ్గారు. ఈ త్రిఫల వెయిట్ తగ్గడానికి సైంటిఫిక్ గా తీసుకుంటే కణం లోపల ఆహార పదార్థాలను బాండ్ చేసే మైటోకాండ్రియాలు మెటబాలిజంని పెంచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇక రెండో పరిశోధన 2012లో హైదరాబాదులో బిట్స్ పిలాని క్యాంపస్ లో ఎలుకల పైన పరిశోధన చేశారు.

ఈ త్రిఫల చూర్ణం ఇవ్వడం ద్వారా బ్లడ్ గ్రూప్ లెవెల్ పెరగడం లేదు అని రీజన్ ఇచ్చారు. ఎందుకు అంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ గా మారితేనే గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ గా మారడానికి అవసరమయ్యే ఆల్ఫా అమైలేజ్ కన్వర్షన్ కి ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్స్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. కాబట్టి ఈ ఆల్ఫా అమైలేజ్ నీ త్రిఫల తగ్గిస్తోంది. కాబట్టి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని చెప్పారు. దీనిని ఐదు గ్రాములు చొప్పున ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.

ఇందులో ఉసిరికాయ ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్ గా రక్షణ వ్యవస్థని ఆక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండవది కరక్కాయలు ఉండే టేనిన్స్, కౌమారి ఉండడం వల్ల కఫం శ్లేష్మం ని తగ్గిస్తుంది. మూడవది తానిక్కాయ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top