Home remedies for hair growth and thick: ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం సర్వసాధారణమైపోయింది. కొంతమందికి రక్తహీనత వలన మరికొంతమందికి శరీరంలో కావలసిన పోషకాలు అందకపోవడం వలన మరికొంతమందిలో థైరాయిడ్ సమస్య ఉండటం వలన జుట్టు రాలడం (Hair fall Remedies) సమస్య ఎక్కువగా ఉంది.
జుట్టు రాలడం తగ్గించుకోవడానికి ఎన్ని మందులు ఉపయోగించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం జుట్టుకు కావలసిన పోషకాలు సరైన మోతాదులో అందిస్తూ ఉండాలి.
ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దానితోపాటు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తూ ఉండాలి. మందార ఆకులతో పాటు ఇది కలిపి నూనె తయారు చేసుకుని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి వారం రోజుల్లో జుట్టు విపరీతంగా ( Regrow hair naturally) పెరుగుతుంది.
- ముందుగా కొన్ని మందార ఆకులను తీసుకోవాలి. మందార ఆకులో విటమిన్ సి అధికంగా కలిగి ఉంటాయి. జుట్టు రాలడం తగ్గించడంలో విటమిన్-సి ముఖ్య పాత్ర వహిస్తుంది. మందార నూనె జుట్టు కుదుళ్లను చాలా దృఢంగా తయారుచేస్తుంది.
- మందార నూనె ఉపయోగించడం వల్ల జుట్టు మూలాల నుండి బలంగా తయారవుతుంది. మందార ఆకుల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి జుట్టులో ఉండే చుండ్రు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి.
- చివర్లు చిట్లడం తగ్గించడంలో కూడా మందార నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది.
10 లేదా 15 మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత దీనిలో కరివేపాకు వేసుకోవాలి. కర్వేపాకు జుట్టు కుదుళ్లు బలంగా చేసి, జుట్టుని నల్లగా చేయడంలో సహాయపడుతుంది.
తలకు బీటాకెరోటిన్ అందించడంలో కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును మాయిశ్చరైజ్ చేయడంలో సహాయపడతాయి.
4 లేదా 5 రెమ్మలు కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండడం వల్ల తలలో ఉండే చుండ్రు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను తగ్గించి, జుట్టు ఒత్తుగా పెరగడానికి (remedies for hair growth and thickness) సహాయపడుతుంది.
తర్వాత ఒక చెంచా మెంతులు వేసుకోవాలి, మెంతులు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి జుట్టు తేమగా ఉంచడానికి సహాయపడతాయి.
వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
దీనిలో నీళ్లు వేసుకోకూడదు.
ఈ మిశ్రమాన్ని వేసి, ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఈ పేస్ట్లో ఉండే పోషకాలు నూనెలో దిగేంతవరకు మరిగించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
తర్వాత నూనెను వడగట్టుకుని ఏదైనా గాజుసీసాలో స్టోర్ చేసుకోవాలి.
ఈ ఆయిల్ రాత్రి పడుకునే ముందు అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి. లేదు మీరు రేగులర్గా నూనె పెట్టుకుంటాం అనుకునేవాళ్ళు ప్రతిరోజు రాసుకోవచ్చు.
ఈ నూనె కుదుళ్ళ నుండి చివర్ల వరకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.