కంటి కింద నల్లటి వలయాలు రావడానికి గల కారణాలు…….. కంటి కింద నలుపు తీసివేసే బెస్ట్ క్రీం…

చాలామందికి కంటి కింద నలుపు వచ్చి వాళ్ళ అందానికి ఆటంకం కలిగిస్తుంది. వీటిని తొలగించుకోవడానికి అనేక ట్రీట్మెంట్లు తీసుకుంటారు. కానీ వాటి వలన దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ఇలాంటి నల్లటి వలయాలు రావడానికి 11 రకాల కారణాలు ఉన్నాయి.1. స్ట్రెస్ వలన నల్లటి వలయాలు వస్తాయి. స్ట్రెస్ కలిగించే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వలన మెలనిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. 2. నిద్ర సరిగ్గా లేకపోవడం. ఈరోజుల్లో ఇది కూడా చాలా ఎక్కువ అయిపోయింది. 3. పనిలో ఎక్కువ అలసటకు గురి అవ్వడం. 4.హెరీడెడ్రీ. వారసత్వం వలన. ఇది వరసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది.

5. హార్మోనల్ డిస్టబెన్స్ లేదా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వలన ఈ కళ్ళ కింద నలుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొందరిలో కొన్ని బాడ్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దాని వలన ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. 6. వయసు పెరగడం వలన. వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ, వయసు పెరిగే కొలది తినే ఆహారం వలన నల్లటి చారలు వస్తూ ఉంటాయి. 7. కొంతమందికి హైపో థైరాయిడిజమ్ వస్తుంది. దీనివలన కళ్ళ కింద నలుపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 8. ఎనీమియా. 9. స్మోకింగ్ వలన, మరియు ఆల్కహాల్ తాగడం వలన.

10. డిహైడ్రేషన్ వలన. చాలామంది నీళ్లు తక్కువగా తాగుతూ ఉంటారు. దీనివల్ల బాడీ డిహైడ్రేషన్ లో ఉండి కళ్ళ కింద నలుపులు వస్తాయి. 11. ఐ స్ట్రైన్. కంప్యూటర్స్, లాప్టాప్స్ ఎక్కువగా చూడటం వలన కంటిపై ఒత్తిడి పడి నల్లటి చారలు ఎక్కువగా వస్తాయి. వీటిలో ఏ కారణం వల్ల మీకు చారలు వస్తున్నాయో గ్రహించి వాటిలో మార్పులు చేసుకోవడం వలన వాటి నుంచి విడుదల పొందవచ్చు. పై పోతగా కరక్కాయను సాన పెట్టే రాయి మీద అరగదీసి ఆ పేస్ట్ ను కంటి కింద రాయడం ద్వారా కళ్ళకింద ఇన్ఫ్లమేషన్  తగ్గించి నలుపు వర్ణాన్ని తగ్గిస్తుంది.

ఇలా రోజుకి రెండుసార్లు చేయడం చాలా మంచిది. మరియు మానసిక ఒత్తిడి తగ్గించుకుంటూ ప్రాణయమాలు, మెడిటేషన్ చేస్తూ మొలకెత్తిన గింజలు డ్రై ఫ్రూట్స్, సలాడ్స్, ఆకుకూరలు, జ్యూస్ లు వంటివి ఆహారంలో మార్పులు చేసుకోవడం వలన వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top