డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అరికాళ్ళలో తిమ్మిర్లు రావడం, స్పర్శజ్ఞానం కోల్పోవడం, బరువుగా ఉండి ఏ పని చేయలేకపోవడం, మరియు కాళ్లు బ్యాలెన్స్ కోల్పోయి సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి వాళ్ల కోసం ఈరోజు మనం తయారుచేసుకునే చిట్కా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మనకు మూడు పదార్థాలు అవసరం పడతాయి అవి 1. అశ్వగంధ పొడి. ఇవి ఎక్కువగా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. 2. మంజిష్ఠ. ఇది ఎర్రగా ఉంటుంది. 3.పసుపు. ఇది మనకు పరిచయం ఉన్నది.
ఇప్పుడు ఈ రెమిడి కోసం 100 గ్రాముల అశ్వగంధ పొడి 100 గ్రాములు మంజిష్ట మరియు 100 గ్రాముల పసుపు సమపాళ్లలో కలుపుకోవాలి. దీనిని ఒక్క స్పూన్ గోరు వెచ్చని నీటిలో కలుపుకుని రోజు పరగడుపునే ఉదయం సమయంలో తీసుకోవాలి. ఇది తీసుకున్న ఒక గంట వరకు ఎటువంటి అల్పాహారం గాని, జ్యూస్లు గానీ తీసుకోకూడదు. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేసే గంట ముందు ఈ గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇలా 15 రోజుల పాటు చేసిన తరువాత ఈ రెమిడి మనకు ఉపయోగపడుతుందో లేదో తెలుస్తుంది.
ఇది తాగడం ద్వారా అరికాళ్ళలో తిమ్మిర్లు, మరియు మంటలు రావడం తగ్గుతుంది. మరియు మంచి ఫలితం లభిస్తుంది. డయాబెటిక్ ఫ్యూరిఫెరల్ న్యూరోపతి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందు ప్రభావం చూపించదు. అలాంటప్పుడు ఆయుర్వేద డాక్టర్స్ ను సంప్రదించవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఔషధం ఈ వ్యాధి యొక్క ప్రారంభ దశలో పనిచేస్తుంది. ఇది ఉన్న వాళ్లకు నరాలు పూర్తిగా దెబ్బతింటాయి. మన శరీర తత్వాన్ని బట్టి కూడా వ్యాధి యొక్క తీవ్రత మరియు లక్షణాలు మారుతు ఉంటాయి. నూటికి 60 మంది లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఆయుర్వేదంలో పై పూతకు మరియు లోపలికి తీసుకోవడానికి ఒక మంచి తైలం ఉంది. అది మధుమేహం మీరా తైలం. ఇది మూడు రకాలుగా వాడుతారు.1. వ్యాధి యొక్క తీవ్రత బట్టి ఒకటి లేదా రెండు స్పూన్లు పాలల్లో కలిపి తీసుకోవడం జరుగుతుంది. రెండవదిగా దీనిని మోకాళ్ళ నుంచి అరికాళ్ళు వరకు డాక్టర్ల పర్యవేక్షణలో మసాజ్ చేయడం జరుగుతుంది. మూడవదిగా దీన్ని ఎనీమా లాగా ఇస్తారు దీనివల్ల కూడా చాలా మంచి ఉపశమనం ఉంటుంది. కానీ ఇవి డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉపయోగించవలసి ఉంటుంది….