భారతదేశంలో పూర్వకాలం నుంచి ఆయుర్వేదం మన ధర్మాలతో అనుసరించి ఉపయోగించడం జరుగుతుంది. అందుకే ధర్మాన్ని ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారు వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మన పెద్దలు గుడికి వెళ్ళినప్పుడు పరగడుపున వెళ్ళమని చెబుతూ ఉంటారు. ఈ ధర్మం వెనుక మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుడికి పరగడుపునే వెళ్ళినప్పుడు అక్కడ తీర్థప్రసాదాలు రూపంలో తులసి నీరు, అప్పుడప్పుడు మీకు ప్రసాదం రూపంలో యాలుకలు, లవంగాలు ఇస్తూ ఉంటారు. వీటిని పరగడుపున తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
అలాగే ఒక్కొక్కసారి వెన్న మరియు పటికి బెల్లం ముక్కలు ఇస్తూ ఉంటారు. వీటివలన కడుపు చల్లబడుతుంది. కనుక పరగడుపున ప్రసాదాలు తీసుకోవడం వలన మనకు చాలా అనారోగ్యాల నుంచి విడుదల పొందవచ్చు. అలాంటి వాటిలో నుంచి ఇప్పుడు ఒక దాని గురించి మనం తెలుసుకుందాం. అవి లవంగాలు. ఇవి ప్రతి ఇంట్లో సులువుగా లభిస్తాయి. వీటిని టీ,కూరల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. లవంగాల లో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి ఉన్నచోట ఎటువంటి బ్యాక్టీరియా గాని వైరస్లు దరీ చేరవు.
అందువలన ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మన పెద్దలు లవంగాలు తీసుకోమని చెప్పారు. అలాగే ఎవరైతే రోజు రెండు లవంగాలు నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారో వాళ్లకు ఎటువంటి వైరస్లు అనారోగ్యాలు దరిచేరవు. అలాగే వీటిలో పొటాషియం క్యాల్షియం, ఐరన్ మరియు ఎన్నో రకాల విటమిన్స్ ను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు రాలే సమస్య నుంచి కూడా విడుదల అందిస్తాయి. మరియు జుట్టు త్వరగా తెల్లబడకుండా చేస్తాయి. ఇవి రక్తప్రసరణను వృద్ధి చేస్తాయి. నిద్రలేమి నుంచి కూడా విడుదల అందిస్తుంది. మరియు స్ట్రెస్ టెన్షన్ నుంచి కూడా విడుదల పొందవచ్చు. మరియు దంతాలలో నొప్పి వస్తే లవంగం నోట్లో పెట్టుకొని చప్పరిస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
మరియు లవంగాలను రోజు తీసుకోవడం వలన అధిక కొవ్వు నుంచి విడుదల పొందవచ్చు. ఎందుకంటే ఇవి మెటబాలిక్ రేట్నీ పెంచుతాయి. ఇది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా మలబద్ధకం నుంచి విడుదల పొందవచ్చు. మలబద్దకం అనేది ఇది చాలా అనారోగ్యాలకు కారణమవుతుంది. కనుక రోజు రెండు లవంగాలను తీసుకోవడంవల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తద్వారా మన ధర్మాలను ఆచరించడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి.