మనం పురాతన కాలం నుంచి చిన్నపిల్లలకు రోజు స్నానం చేయించేటప్పుడు సున్నిపిండి పెట్టడం అలవాటుగా వస్తుంది. ప్రస్తుత కాలంలో సున్నిపిండి పట్టించుకోవడం మానేసి అందరూ రెడీమేడ్ పౌడర్ ఉపయోగిస్తున్నారు. ఇవి కెమికల్స్ తో తయారు చేసినవి అవ్వడం వలన చాలామంది పిల్లలకు పడక రెసెస్ వస్తూ ఉంటున్నాయి. మరల వాటికోసం డాక్టర్స్ చుట్టూ తిరగవాల్సి వస్తుంది. వీటి వలన చిన్న పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే సున్నిపిండి వలన చిన్న పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
అంతేకాకుండా ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే సున్నిపిండి చిన్న వారితో పాటు పెద్దవారు కూడా ఉపయోగించవచ్చు. ఈ సున్నిపిండి కోసం ఉపయోగించేవి అన్నీ మన ఇంట్లో లభించేవి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఈ సున్నిపిండి తయారు చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది ఎర్ర కందిపప్పు. ప్రస్తుత కాలంలో ఎర్ర కందిపప్పును అందరూ విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎర్ర కందిపప్పును ఉపయోగించడం వలన మన చర్మం నునుపుగా మెరుస్తూ కనిపిస్తుంది. రెండవదిగా మనకు కావాల్సింది బాదంపప్పు.
బాదంపప్పు మన చర్మం ను మాయిశ్చరైజర్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మంపై ఉన్న మృత కణాలు తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఈ ఎర్ర కందిపప్పు మరియు బాదంపప్పును మూడు నాలుగు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టాలి. ఆ తర్వాత వీటిని మెత్తని పొడి లాగా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. జల్లించుకోగా వచ్చిన మెత్తని పొడిని సున్నిపిండి అంటారు. కావాలి అనుకుంటే బరకగా ఉన్న పిండిని మరలా ఎండబెట్టి మళ్లీ మెత్తని పొడి లాగా చేసుకోవచ్చు. ఇలా తయారైన సున్నిపిండిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా మన చర్మం పై మీగడ తీసుకొని చర్మం పై అప్లై చేసి ఆ తర్వాత సున్ని పిండిని రోజు వాటర్ లేదా సాధారణ నీటితో సున్నిపిండి లాగా కలుపుకొని ఒంటికి పట్టించి నలుపు కోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఉన్న రెండు, మూడు పొరల మృత కణాలు తొలగించబడతాయి. దీనివలన చర్మం మంచి తేజస్సుగా కనిపిస్తుంది. మృత కణాలు తొలగించబడటం వలన లోపలి పొరలు నునుపుగా మారుతాయి. దీనివలన చిన్న పిల్లలు ప్రకాశవంతంగా కనిపిస్తారు. మరియు వారి చర్మం తెల్లగా మెరిసిపోతుంది…