లాంగ్ హెయిర్ సీక్రెట్, ఎంత కర్లీ హెయిర్ ఐనా ఐదు నిమిషాల్లో స్ట్రైట్ గా, సిల్కీగా మారుతుంది

ప్రస్తుత అందరూ కొత్త కొత్త హెయిర్ స్టైల్ చేసుకోవడం కోసం,   స్త్రైట్ గా చేసుకోవడం కోసం రకరకాల ఎలక్ట్రికల్ వస్తువులను ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రికల్ వస్తువులు  నుండి వచ్చే వేడి గాలి జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది.  హెయిర్ డ్యామేజ్ తగ్గించుకోవడం కోసం మళ్ళీ రకరకాల ఆయిల్స్  ఉపయోగిస్తారు.  వీటిలో అనేక రకాల కెమికల్స్ ఉండడం వలన జుట్టుకు ఎఫెక్ట్ అవుతాయి. జుట్టు రాలడ, చుండ్రు వంటి  రకరకాల సమస్యలు వస్తాయి.

ఇటువంటి సమస్యలు రాకుండా నాచురల్ గా  జుట్టును స్ట్రైట్ గా, సిల్కీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం బాగా పండిన అరటి పళ్ళు మూడు  తీసుకోవాలి.  వీటిని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో  వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని నాలుగు చెంచాల అవిసె గింజలు వేసుకోవాలి. అవిస  గింజలు జుట్టు రాలడం తగ్గించి  జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడతాయి. జుట్టు స్ట్రైట్ గా, సిల్కీగా అవడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఒకటిన్నర గ్లాసు నీళ్లు వేసుకోవాలి.

అయిదు నుంచి పది నిమిషాల పాటు  అవిస  గింజలను ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే  స్ట్రైనర్ సహాయంతో అవిస గింజలు నుండి వచ్చే జెల్  వడకట్టుకోవాలి. వడకట్టుకున్న జెల్ మిక్సీ జార్లో  వేసుకోవాలి. తర్వాత కలబంద మట్టలను తీసుకొని పై తొక్క తీసి లోపలి జెల్  మాత్రమే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు  మిక్సీ జార్లో వేసుకోవాలి. పై గ్రీన్ కలర్లో ఉండే తొక్క  తీసుకున్న తర్వాత ఒకసారి నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి.

వీటన్నింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకోవడానికి ముందు జుట్టు  ఆయిల్ హెయిర్ అయినా డ్రై హెయిర్ అయినా సరే పర్వాలేదు. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 45 నిమిషాల నుండి ఒక గంట వరకు ఆరనివ్వాలి. తరువాత ఏదైనా హోమ్మేడ్ లేదా మైల్డ్  షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా చిక్కులు పడకుండా సిల్కీగా, స్ట్రైట్ గా అవుతుంది. ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top