ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం కూడా ఎక్కువగానే ఉంది. కానీ చిన్న వయస్సులోనే అనేక రకాల నొప్పులకు గురవుతుండటంతో అందరూ నొప్పులు తగ్గించుకోవడానికి మంచి చిట్కాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి యొక్క విశిష్టత అందరికీ అర్థమయింది. ఇంట్లోనే ఈ నొప్పులు తగ్గించుకోవడానికి మనం ఇంట్లో ఉండే వస్తువులతో ఒక హెర్బల్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఇది శరీరంలో ఉండే అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. నడుము నొప్పి, వెన్ను నొప్పులు, కీళ్ల నొప్పులు, మడమల నొప్పి, జాయింట్ పెయిన్స్ అన్నింటినీ తగ్గించడంలో ఈ ఆయిల్ మ్యాజిక్ చేస్తుంది.
ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ ఆయిల్ తయార చేసుకుందాం. దానికోసం మనకి ఐదారు రేఖల వెల్లుల్లి రెబ్బలు కావాలి. వెల్లుల్లి నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. వీటి పై పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక ఇంచు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ వాము, ఒక దాల్చిన చెక్క ముక్క, తీసుకోవాలి. దాల్చిన చెక్కను పొడిగా చేసి వాడుకోవాలి. అలాగే ఐదారు లవంగాలను కూడా తీసి పెట్టుకోవాలి. లవంగాలను కూడా పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఐరన్ ఫ్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు ఆవ నూనె వేసుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలన్నింటిని ఈ నూనెలో వేసి చిన్నమంటపై బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కలుపుతూ వేయించాలి.
పదార్థాలన్నీ రంగు మారిన తర్వాత స్టవ్ ఆపేసి రాత్రంతా నూనెను పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం పోషకాలు చేరిన ఈ నూనెను వడకట్టి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ తగ్గి ఎముకల మధ్యలో గుజ్జు పెరగడానికి ఈ మసాజ్ సహాయపడుతుంది. ఇందులోని పదార్థాలు నొప్పి నుండి ఉపశమనం ఇవ్వడంలో మనకు సహాయపడతాయి. ఇలా ఇంట్లోనే తయారు చేసుకునే నూనెను మూడు రోజుల వరకు వాడుకోవచ్చు. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు తాజాగా తయారుచేసుకొని వాడుకోవడం మంచిది.