జుట్టు రాలే సమస్య ఎంత ఎక్కువగా ఉంది అంటే కలిసిన ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ మాట ప్రస్తావన వస్తే కనీసం గంట సేపైనా ఈ విషయం గురించి మాట్లాడుకుంటారు. కనీసం ఒక్కరు కూడా నాకు ఎటువంటి జుట్టు సంబంధించిన సమస్యలు లేవని చెప్పరు. ఏదో ఒక సమస్యతో జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు తెగిపోవడం, చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అందుకే జుట్టు సంరక్షణ కోసం మనం మంచి పోషకాహారం తింటూ బయట కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము, ధూళి చేరకుండా స్కార్ఫ్ వాడడం కెమికల్స్ లేని షాంపూలు వాడటం బయటి నుండి కూడా పోషకాలు అందించడం చేస్తుండాలి. దానితో పాటు మంచి హెయిర్ ఆయిల్ కూడా జుట్టు తేమను కోల్పోకుండా జుట్టు బలంగా దృఢంగా ఉండేందుకు సహాయపడుతాయి. దానికోసం మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ ఆవనూనె తీసుకుంటే ఒక గ్లాస్ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్ల మెంతులు నానబెట్టినవి తీసుకోవాలి. పది వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగి నానబెట్టుకున్న మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకుతో మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఐరన్ పాత్రలో ఈ పేస్ట్ వేసుకొని ఆవనూనె, కొబ్బరి నూనె వేసుకొని చిన్నమంటపై మరగ పెట్టాలి. ఇది కొంచెం సేపు అంటే పదినిమిషాలు మరిగితే సరిపోతుంది.
తర్వాత స్టవ్ ఆపేసి ఒక పలుచని క్లాత్లో ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. అప్పుడు గ్రీన్ కలర్లో ఉండే ఆయిల్ వస్తుంది. తర్వాత ఈ నూనెలో 3 విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలుపుకోవాలి. నూనెను బయట పెట్టకూడదు. ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఉపయోగించవలసి ఉంటుంది. ఉపయోగించడానికి గంట ముందు ఫ్రిజ్ నుండి బయట పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకొని ఫింగర్ టిప్స్తో మాత్రమే తలకి మర్దన చేసుకోవాలి. గోళ్ళు, వేళ్ళతో హర్ష్గా చేయడం వల్ల జుట్టు చిట్లి రాలిపోయే అవకాశం ఉంది. ఈ నూనె వాడడం వలన జుట్టు సమస్యలు 90% తగ్గుతాయి.