ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వినియోగించబడుతున్న కూరగాయల్లో బంగాళాదుంప మొదటి స్థానంలో ఉంది. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు బంగాళదుంప మనల్ని బతికించేస్తుంది. సాంబార్, మసాలా కూర, కరకరలాడేలా ఫ్రై, సాయంత్రపు స్నాక్స్ కోసం చిప్స్, కొత్త పుంతలు తొక్కుతున్న ఫ్రెంచ్ ఫ్రైస్, బొండ, చాట్ ఒకటేమిటి వంటగదిలో బంగాళదుంప సామ్రాజ్యం చాలా పెద్దదనే చెప్పాలి.
◆ పొటాషియం మరియు ఇతర ముఖ్యమైన విటమిన్ల సమ్మేళనం అయిన బంగాళాదుంపలు ఆహారంగా తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నప్పటికీ వీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయ్. అవేంటో చదివేయండి మరి.
◆ బంగాళాదుంపలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి, అధిక గ్లైసెమిక్ నిల్వలు కలిగిన బంగాళాదుంపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటిలోని గ్లూకోజ్ లు తొందరగా రక్తంలోకి చేరిపోయి చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి సమస్యగా మారుతుంది. అలాగే మధుమేహాన్ని తొందరగా శరీరంలోకి చొచ్చుకొచ్చేందుకు కూడా కారణమవుతుంది. అందువల్ల, అధిక స్థాయిలో రక్తంలో చక్కెరతో బాధపడుతున్న వారు బంగాళాదుంపలను ఏ రూపంలో కూడా తీసుకోకూడదు
◆ వీటిలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న కారణంగా బరువును తొందరగా పెంచుతాయి. ఇవి ఆకలిని పెంచుతాయి. బంగాళాదుంపలు ఎక్కువగా తీసుకునేవారిలో తిన్న కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి వేయడం బాగా గమనించవచ్చు. ఇక వేయించిన బంగాళాదుంపలు మరియు చిప్స్ లలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి చాలా తొందరగా స్థూలకాయంకు దారితీస్తాయి.
◆వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల, జీర్ణక్రియను ఆటంకం కలిగిస్తాయి. కడుపులో గ్యాస్ మరియు ఉబ్బరంను బంగాళదుంప ప్రేరేపిస్తుంది. బంగాళదుంపల్లో అనారోగ్యాన్ని చేకూర్చే పీచు అధికంగా ఉంటుంది. ఇది కడుపులో తిమ్మిర్లు, విరేచనాలు, మలబద్దకం, పేగు సంబంధ సమస్యలు, పేగు అడ్డుపడటం వంటి జీర్ణసంబంధ సమస్యలను కలుగజేస్తుంది.
◆ బంగాళాదుంపలు యాంటీఆక్సిడెంట్స్ యొక్క గొప్ప మూలం. యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి మంచివి అయితే ప్రతి ఖనిజం మితంగా ఉపయోగపడుతుంది. అలాగే బంగాళాదుంపలోని ఖనిజాలు కూడా శరీరానికి పరిమిత మోతాడులోనే అవసరం. శరీరంలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉండటం ఆరోగ్యానికి హానికరం అవుతుంది. యాంటీఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని కాపాడుతాయి మరియు బయటి శరీరం నుండి క్యాన్సర్ ఏజెంట్లతో పోరాడటానికి సహాయపడతాయి. కానీ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల శరీరంలో క్యాన్సర్ పెరుగుదలకు దోహదపడుతుంది కూడా.
◆ బంగాళాదుంపలను గర్భిణీ స్త్రీలు తీసుకోకపోవడమే ఉత్తమం. డాక్టర్ సలహా మేరకు ఎంత మోతాదులో వాడుకోవచ్చు అనేది నిర్ణయించబడుతుంది.
◆ బంగాళాదుంపలు ఎక్కువగా తినడం వల్ల హైపోటెన్షన్ వస్తుంది. హైపోటెన్షన్ వల్ల మన రక్తపోటు అసాధారణంగా తక్కువ స్థాయికి పడిపోతుంది, మరియు అలసట, తేలికపాటి తలనొప్పి, మైకము, వికారం, క్లామి స్కిన్, డిప్రెషన్, అస్పష్టంగా కనిపించడం మొదలైన లక్షణాలను కలిగిస్తుంది. బంగాళాదుంపలను వారంలో 4 సార్లు కంటే తక్కువ తీసుకోవడం ఆరోగ్యకరం. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే రక్తపోటు వస్తుంది.
చివరగా…..
బంగాళదుంప ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది.