కలిపి తీసుకోకూడని ఆహార పదార్థాలు ఇవే

ఆహారం తినేటప్పుడు కొన్ని పదార్థాలు  కలిపి తింటే బాగుంటాయి. కానీ అన్ని పదార్థాలు కలిపి తినడంవలన అవి విషంలా మారే అవకాశం ఉంది. అలర్జీ, వాపులు వచ్చి వాంతులు, కడుపునొప్పి, విరోచనాలు అవ్వొచ్చు. పుల్లటి త్రేన్పులు, గ్యాస్, కడుపుబ్బరంలాంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అలాంటి సరిపడని  పదార్థాలు గురించి  తెలుసుకుందాం.

విరుద్ధ ఆహారాలు తీసుకుంటే అవి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతాయి. పాలలో నిమ్మకాయ వేస్తే విరిగిపోతాయి అని తెలుసు. అవి విడివిడిగా ఒకేసారి తిన్నా కూడా కడుపులో ఇలాగే అవుతాయి. పాలతో పండ్లు కలిపి తీసుకుంటే సైనస్,దగ్గు జలుబు వంటి సమస్యలు వేధిస్తాయి. అలర్జీ, అనేక చర్మ సమస్యలు వస్తాయి. కొంతమంది పాలతో సాల్ట్ బిస్కెట్లు తింటారు.

ఉప్పుతో ఆస్ట్రిజెంట్ గుణాలు ఉంటాయి. పాలలో న్యూట్రీషన్లు ఉంటాయి. పాలతో తీపిపదార్థాలు తప్ప వేరే పదార్థాలు తినకూడదు. కిచిడీతో కలిపి పాలను కలపకూడదు. ఇలా చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడూ పాలతో చికెన్, చేపలు వంటి మాంసాహారం తినకూడదు. పాలతో వేయించిన వేపుళ్ళు తినకూడదు. అలాగే గుడ్లు కూడా తినకూడదు.

పాలలో ప్రొటీన్ ఫుడ్ అలాగే గుడ్లు కూడా ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఒకేసారి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే అది జీర్ణమవక అనేక సమస్యలకు కారణమవుతుంది. హైబీపీ, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అందుకే చేపలు, గుడ్లు, మాంసాహారం తినకూడదు. ఇలా తింటే త్వరగా జీర్ణమవకపోగా అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. అందుకే పాలతో పాటు పెరుగు కూడా తినకూడదు.

 డెయిరీ ప్రోడక్ట్స్తో పాటు ముల్లంగిని కలిపి తినకూడదు. ఎందుకంటే పాలపదార్థాలు శరీరంలో చల్లదనానిస్తే ముల్లంగి వేడిచేస్తుంది. అందుకే ఈ కాంబినేషన్ అంత మంచిదో కాదు. అనేక జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతుంది. పాలను యాంటీ బయోటిక్స్ తో కలపడంవలన ఇన్పెక్షన్లు వస్తాయి. అలాగే ఆకుకూరలు ముల్లంగితో పాటు పాలను తాగకూడదు.

మినప్పప్పు తినప్పుడు లేదా మినపప్పుకి సంబంధించిన ఆహారపదార్థాలు  తిన్నపుడు పాలు కలపకూడదు.పండ్లు కూడా వేరే ఆహార పదార్థాలతో కలిపి తినకూడదు. ఒకవేళ పండ్లు తింటే రెండు గంటలవరకూ ఏమీతినకూడదు. చల్లగా ఉండేవి వేడిగా ఉండేవి ఒకేసారి కలిపితినకూడదు. ఇందులో ముఖ్యమైనవి పెరుగు, కాఫీ, ఐస్ర్కీం, టీ కలిపి తినకూడదు.

భోజనం చేసే సమయంలో చల్లని టీని తాగడంవలన జీరణమవడానికి కావలసిన జీర్ణరసాలు ఉత్పన్నమవవు. వేడి నీటిలో తేనె కలపకూడదు. గోరువెచ్చని నీటిలో మాత్రమే తేనెని కలుపుకోవాలి. టీలో తేనె కలపకూడదు.దీనివలన ఫుడ్పాయిజన్ అవుతుంది. జ్వరం ఉన్నప్పుడు కూడా తేనె తీసుకోకూడదు. ఇలాంటి చాలా పదార్థాలు కలిపి తీసుకోకూడనివి ఉన్నాయి. అందుకే అవగాహన పెంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top