కాలానికి తగ్గట్టు చర్మ సంరక్షణ తీసుకోవడం తప్పనిసరి. చలికాలంలో పొడి చర్మం ఉన్నవారు ఎలాగైతే ఇబ్బందులు పడతారో, వేసవిలో జిడ్డు చర్మం కలవారు అంతే ఇబ్బంది ఎదుర్కొంటారు. వేసవి వల్ల ఎదురయ్యే చెమట ఈ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది. తద్వారా మొటిమలు రావడం, మొహం అంతా వికారంగా తయారు అవ్వడం వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లో తయారయ్యి బయటకు వెళ్ళామా లేదా కనీసం 5 నిమిషాలు కూడా మొహం తాజాగా ఉండదు. అంతటి సమస్యను మోయక్కర్లేదు, జిడ్డు చర్మం కలవారికి ఈ వేసవిలో తాజాగా ఉండేందుకు చక్కని చిట్కాలు చూడండి మరి.
కలబంద
కలబంద సహజంగా చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇది సహజంగా యాంటీ బాక్టీరియల్. జిడ్డుగల చర్మంతో బాధపడుతుంటే తప్పకుండా దీన్ని రోజువారీ వాడకంలో భాగం చేసుకోవాలి. కలబంద జెల్ ను ముఖానికి నేరుగా రాసుకుని పది నిమిషాల తరువాత గది ఉష్ణోగ్రత వద్ద గల నీటితో శుభ్రజం చేసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతూ, జిడ్డును తొలగిస్తుంది.వీలైనంత వరకు తాజా కలబంద జెల్ ను ఉపయోగించడానికి ప్రయత్నం చేయడం ఉత్తమం. తాజాగా దొరకని పక్షంలో కలబంద తాలూకూ రసాయనాలు కలపని ఉత్పత్తులను వాడటం ఉత్తమం.
ఓట్స్ పౌడర్ మరియు తేనె
ఓట్స్ పౌడర్ ను వోట్మీల్ అంటారు. వోట్మీల్ మరియు తేనె రెండింటిని బాగా కలిపి – ఫేస్ మాస్క్ గా వాడటం వల్ల చర్మం మీద జిడ్డు తొలగిపోవడమే కాకుండా తాజాదనాన్ని కూడా చేకూరుస్తుంది. చర్మం మీద మృతకణాలు, మలినాలు తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ముఖ్యంగా చర్మ రంద్రాలు తెరుచుకునేలా చేసి మచ్చల రూపంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి చర్మాన్ని క్లియర్ గా ఉండేలా చేస్తుంది.
దోసకాయలు
కీరా దోస దొరకాలే కానీ కసుక్కున నమిలి పడేస్తాము. అయితే ఈ దోస జిడ్డు చర్మానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ఆరోగ్యం కోసం కీరా దోసను, సలాడ్ లు, స్నాక్స్ సమయాల్లో తినడం చాలామంది చేసేదే. ఎక్కువ శాతం నీటిని కలిగిఉండే ఈ కీరా దోస చర్మ సంరక్షణలో అందెవేసిన చేయి అని చెప్పవచ్చు. జిడ్డుగల చర్మానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా శరీరాన్ని హైడ్రేటింగ్ గా ఉంచడంలో, రక్తస్రావాన్ని నివారించడంలో మరియు సాగిపోయిన చర్మరంధ్రాలను తిరిగి బిగుతుగా చేయడంలో దోహాధం చేస్తుంది. కీరా లో విటమిన్ ఎ, ఇ మరియు మెగ్నీషియం వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు అధికంగా ఉన్నాయి ఇవి గొప్పగా చర్మసంరక్షణ చేకూరుస్తాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్
వెనిగర్ గూర్చి చాలా మందికి తెలుసు కానీ ఆపిల్ సైడర్ వెనిగర్ సాధారణ వెనిగర్ కంటే అద్భుతమైన పలితాలు ఇస్తుంది. ముఖ్యంగా చర్మం సాగిపోయి వధులైపోయి తెరచుకున్న చర్మరంధ్రాలను బిగుతుగా చేయడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాన్ని కలిగి ఉండటం వల్ల చనిపోయిన చర్మ కణాలను తొలగించి జిడ్డు అధికంగా ఉత్పత్తి కాకుండా సహాయపడి మచ్చలను, మొటిమలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
టమాట
దోసకాయల మాదిరిగానే, టమోటాలు సలాడ్ ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. దాని మాదిరిగానే టమాటా కూడా జిడ్డుగల చర్మానికి అనేక ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. చర్మం యొక్క pH ని సమతుల్యం చేయడానికి, చర్మం మీద ఉత్పత్తి అయ్యే జిడ్డును నియంత్రణలో ఉంచడానికి చర్మ రంద్రాలు బిగుతుగా చేసి చర్మానికి యౌవనాన్ని చేకూర్చడంతో ఇలా ఎన్నో విధాలుగా దోహదపడుతుంది. అలాగే టమాటలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది.
గుడ్డులోని తెల్లసొన
గుడ్లులోని తెల్లసొనలో ప్రోటీన్లు మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, కాబట్టి ఇవి జిడ్డుగల చర్మానికి ఔషధంగా పనిచేస్తాయి. దెబ్బతిన్న కణజాలాలను సరిచేయడానికి మరియు రంధ్రాలను కుదించడానికి సహాయపడతాయి. ఇది మీ చర్మం నుండి మలినాలను మరియు అదనపు నూనెను తొలగించడానికి కూడా పనిచేస్తుంది, మచ్చలు మరియు మొటిమలను విచ్ఛిన్నం చేస్తుంది.
చివరగా…..
జిడ్డు చర్మం అనేది చాలా ఇబ్బంది కరమైన సమస్య అయినా పైన చెప్పిన చిట్కాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ కాలమైనా ఆనందంగా గడిపేయచ్చు.