ముఖంపై ఉండే మొటిమలు మచ్చలు తగ్గాలంటే నాచురల్ టిప్స్ ఏంటో చూసేద్దాం రండి. మొదట మొటిమలు గిల్లకూడదు అని గ్రహించాలి. కానీ చాలామంది పిండేస్తే తగ్గిపోతాయని గిల్లుతుంటారు. అలా చేయడంవలన ఇన్ఫెక్షన్ పోతుంది. చీము బయటకు వెళ్ళిపోతుంది కానీ గుంటలు పడతాయి..
ఎక్కువగా రుద్దకూడదు. రుద్దడం వలన కూడా స్కిన్ డామేజ్ అవుతుంది. నెమ్మదిగా ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ముఖానికి ఐదారు నిమిషాలు ఆవిరి పట్టండి. ఓలా ఆవిరి పట్టడంవలన ముఖ చర్మరంధ్రాల్లో ఉన్న మురికిపోయి ముఖం కాంతి వంతంగా మారిపోతుంది.
అందుకని వారానికి కనీసం రెండు రోజులు ఆవిరిపట్టండి. ముఖానికి తేనెని మర్దనా చేయండి. ముఖానికి స్వచ్ఛమైన తేనెను అప్లైచేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోండి. నెమ్మదిగా మర్దనా చేయడం వలన చర్మకణాలు ఉత్తేజితం అవుతాయి. రక్తం సరఫరా మెరుగుపడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్. తేనె చర్మకణాలు రిపేర్ చేసుకునేందుకు సహాయపడతాయి. అప్పుడప్పుడు పొలాల్లో దొరికే మంచి మట్టి తెచ్చుకుని పైపొర తీసేసి లోపలి అడుగు తర్వాత మట్టి తీసుకుని జల్లించి , పొడిలా చేసుకుని ఎండబెట్టుకోవాలి.
దానిని నానబెట్టి ఐదారు గంటల తర్వాత అరంగుళం మందంలా ముఖానికి పూతలా వేసుకోండి. ఇలాచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వారానికి రెండు సార్లు ఇలా చేయండి లేకపోతే ఆవిరి పట్టి తేనెతో మసిజ్ చేసుకోవచ్చు. మట్టిని అరగంట, తేనెను గంట తర్వాత శుభ్రపరుచుకొవచ్చు.
మడ్ పాక్ రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడడంవలన ముఖం కాంతివంతం గా తయారవుతుంది. పోషకాలు అందుతాయి. చెడు రక్తం, కొలెస్ట్రాల్ కరిగిపోతాయి. చర్మరంధ్రాల ఆరోగ్యం గా చేయడానికి సహాయపడతాయి. లోపలికి ఆహారంగా స్త్రీలు నాలుగు లీటర్ల నీళ్ళు, మగవారు ఐదులీటర్ల వరకూ నీటిని తాగవచ్చు. దీనివలన శరీరంలో డీటాక్స్ జరుగుతుంది.
విరోచనం సాఫీగా అవుతుంది ఇలా అవడం వలన. శరీరంలో మలినాలు అధికమయితే రక్తం లో కలిసిపోతాయి. దీనివలన మచ్చలు, మొటిమలు ఏర్పడతాయి. స్త్రీ, పురుషులలో ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ లెవల్స్ కూడా ముఖంపై మచ్చలకు కారణమవుతాయి.
అందుకే వీలైనంతగా ఆరోగ్యకరమైన అలవాట్లతో ముఖాన్ని కాంతివంతం చేసుకోండి.