గోంగూరలో నిజాలు తెలిస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా తినడం మొదలు పెడతారు.

మనం ఉపయోగించే ఆకుకూరలలో ఒకోదానికి ఒకో విశిష్టత ఉంటుంది. సాదారణంగా గుంటూర్రు గోంగూర పచ్చడి అనగానే నోరు నీటి ఊట అయిపోతుంది. గోంగూర పచ్చడి మాటడమే కాదు, గోంగూర పప్పు, నిల్వపచ్చడి ఇలా రకరకాల గా మనం వండుకునే గోంగూర లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుచికి పుల్లగా ఉండే ఈ గోంగూర ప్రయోజనాలు చూసేద్దాం.

విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

గోంగూరలో విటమిన్ సి లో పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి, గాయాలు నయం చేయడానికి మరియు ఎముకలను బలోపేతం చేయడానికి, దంతాలను  ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.

యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది.

హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడగల లక్షణాలను గోంగూర కలిగి ఉంటుంది. సాధారణంగా పులుపు రుచి కలిగిన దాదాపు ప్రతి ఆహార పదార్థంలోనూ విటమిన్ సి ఉంటుంది. యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది

సిస్టోలిక్ మరియు డయాస్టొలిక్ రోగులలో రక్తపోటును తగ్గించడానికి గోంగూర చక్కని ఎంపిక. అధిక రక్తపోటు కాలక్రమేణా గుండెను బలహీనపడిచి తద్వారా తొందరగా గుండె జబ్బులు మరియు గుండె సంబంధిత సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. గోంగూర వాడటం వల్ల రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది.

 ఐరన్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

మన శరీరానికి ఐరన్  అవసరం చాలా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం నుండి జీర్ణశయాంతర వ్యవస్థల వరకు ఎన్నో సమస్యలను నిర్మూలించడంలో సహాయపడుతుంది. అంతేకాదు  అలసటను తగ్గించి, ఊపిరితిత్తుల నుండి మీ శరీరంలోని మిగిలిన ప్రాంతాలకు ఆక్సిజన్‌ను తరలించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా  గర్భవతులలో ఐరన్ చాలా అవసరం ఎందుకంటే  తల్లికి మరియు బిడ్డకు ఇద్దరికి సరిపడా ఎక్కువ రక్తాన్ని  ఉత్పత్తి చేయడానికి ఐరన్ సహాయపడుతుంది. అలాగే ఐరన్ అనేది ఒక సూక్ష్మపోషకం. ఇది కండరాలు, ఎముకలు, కణజాలం, మృదులాస్థి, చర్మం మరియు రక్తాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది.

కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.

ఎదిగే వారిలో  బలమైన ఎముకలను నిర్మించడంలో కాల్షియం యొక్క ప్రాముఖ్యత వర్ణించలేనిది. అయితే నరాలు, గుండె మరియు కండరాలను ఆరోగ్యంగా ఉండడానికి కూడా కాల్షియం చాలా అవసరం. గోంగూరలో ఈ కాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. తరచుగా గోంగూరను తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని క్రమంగా అధిగమించవచ్చు.

యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి

గోంగూరలోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే రసాయనాలతో నిండి ఉంటుంది.  ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్ మరియు గుండె జబ్బులను సృష్టించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.  శరీరంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు లేదా పొగాకు లేదా రేడియేషన్ వంటి హానికరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో గోంగూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

చివరగా…..

ఇన్నాళ్లు గోంగూరను కేవలం ఆహారపదార్థం గా చూసినా అందులోని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఇష్టం లేని వారు కూడా  తినడం మొదలుపెడతారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top