రోజుకి 1 స్పూన్ అధిక బరువు ,బొడ్డు కొవ్వు,శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిస్తుంది

బరువు పెరగడం అనేది ఈ కాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య. ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గని శరీర బరువు కొన్ని ఇంటిచిట్కాలతో ఈజీగా తగ్గించుకోవచ్చు. వాటికోసం ఎక్కువ ఖర్చు పెట్టకుండానే ఇంట్లోనే ఉండే వస్తువులతో బరువు తగ్గొచ్చు. అవేంటో వాటితో ఎలా బరువు తగ్గొచ్చో చూసేద్దామా మరి.

ఈ చిట్కాకోసం ఒక స్పూన్ ధనియాలు తీసుకుందాం. వాటిని చిన్న మంటపై వేయించి అందులోనే స్పూన్ జీలకర్ర, ఒకరెండు రెమ్మల కరివేపాకు వేసి డ్రై ఫ్రైచేయాలి. ఇవన్నీ తేమ లేకుండా వేయించుకున్న తర్వాత చల్లార్చి మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కలిపి తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున ఈనీటిని తాగడం వలన శరీరంలో ఎక్కువగా పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. ప్రతిరోజూ ఇలా తాగితే మంచి ఫలితాలు చూడొచ్చు.

ధనియాలలో పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, కె,సి, పోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం అనే ఖనిజాలు  అధికంగా ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలో చర్మసమస్యల నివారణ కోసం కూడా ధనియాలు ఉపయోగిస్తారు. తామర, గజ్జి, దద్దుర్లు వంటి చర్మసమస్యలు చికిత్స లో ఎక్కువగా ధనియాలు ఉపయోగిస్తారు. ధనియాలలో యాంటీబాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. నోటిలో పూత, చిన్నపుండ్లను కూడా తగ్గిస్తుంది.

ధనియాలలో ఫినలోనిక్ ఆమ్లం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారిలో  ధనియాలను నీటిలో మరిగించి తరుచుగా తాగుతు ఉండాలి. సరైన పోషకాహరం తీసుకోకపోవడం, బలహీన మైన జుట్టు పాలికల్స్, హర్మోన్ల అసమానతలు, ఒత్తిడి వంటి సమస్యలతో జుట్టు రాలిపోవడం ఎక్కువయినప్పుడు ధనియాలు ఆ సమస్యలు తగ్గించి కొత్త జుట్టు పెరిగేలా చేసి జుట్టు బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండడంవలన మలబద్దకం తగ్గించి జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం బాగా జీర్ణమయి గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, కడుపుబ్బరం సమస్యలు తగ్గిస్తుంది. గ్యాస్ సమస్యలకు ధనియాలు మంచి మందుగా పనిచేస్తాయి. ధనియాలు రసం కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ధనియాలు శరీరంలో కొవ్వును కరిగించడాన్ని వేగవంతం చేస్తుంది.

చెడుకొవ్వును కరిగించి మంచికొవ్వును పెంచుతుంది. కొలెస్ట్రాల్, రక్తపోటు గుండెజబ్బులకు కారణమవుతుంది. కొవ్వు, రక్తపోటు అదుపులో ఉంటే గుండె ఆరోగ్యం గా ఉంటుంది. జలుబు, ప్లూ రాకుండా చేస్తుంది. ధనియాలు మూత్రంలో ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. కాన్సర్ కణాలతో పోరాడతాయి.

జీలకర్ర  జీర్ణక్రియను మెరుగుపరిచి తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్దకం తగ్గిస్తుంది. కడుపులో  చెడు వాయువు ఏర్పడకుండా కడుపుబ్బరం సమస్యలు రాకుండా చేస్తుంది. అధికకొవ్వు కరిగించి మంచి కొలెస్ట్రాల్ ఎదుగుదలకు, అధికబరువు సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వలన మంచి ప్రభావం చూపుతుంది.

కరివేపాకు సమృద్ధిగా ఉండే కాల్షియం ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోధృడంగా చేయడంలో సహయపడతాయి.  కాల్షియం సమృద్ధిగా ఉన్నందున, కరివేపాకు పళ్ళు , దంతాలు మరియు ఎముకలను బలోపేతం చేయడానికి మరియు  ఎముకల వ్యాధి వంటి వ్యాధులను నివారించడానికి ప్రభావవంతంగా ఉంటుంది. కరివేపాకులోని ప్రధానంగా ఉండే భాస్వరం మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.

అధిక కొలెస్ట్రాల్ మరియు జీర్ణక్రియలో సహాయపడటానికి కరివేపాకు ప్రభావవంతంగా ఉంటుంది. కాన్సర్ నిరోధకాలుగా ఇందులో ఉండే ఫ్లవనాయిడ్స్ పనిచేస్తాయి. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపుచేస్తాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top