పరగడుపున అంటే ఏమీ తినకుండా ఉన్నప్పుడు తినకూడని పది ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఆహార పదార్థాలు సరైన సమయంలో సరైన పద్థతిలో ఉపయోగించకపోతే అనేక అనారోగ్యసమస్యలకు కారమమవుతాయి. అలాంటి వాటి గురించి సరైన అవగాహన లేక చాలా సార్లు అలా తిని అనారోగ్యాలకు గురవుతుంటాం. అవేంటంటారా.
అందులో మొదటివి కాఫీ, టీలు.
చాలామందికి ఉదయం లేచిన వెంటనే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది ఇలా తాగడంవలన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే కనీసం గ్లాసుడు నీళ్ళైనా తాగిన తర్వాత తాగాలి.
తర్వాత టమాటా. టమాటాలు తినే అలవాటు ఉంటుంది. ఇలా తినకూడదు. పచ్చి టమాటాలలో టానిన్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో యాసిడ్స్ విడుదవడాన్ని ఎక్కువ చేసి గ్యాస్ కి కారణముతాయి.
కూల్డ్రింక్స్, సోడాలు. వీటిలో కార్బొనేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉండడంవలన అల్సర్లు వస్తాయి. అందుకే వీటికి బదులం తాజా పండ్లరసాలు తాగడం మంచిది. అంతేకాకుండా కడుపులో నొప్పి మరియు వాంతులు అవ్వడానికి కారణం అవుతుంది.
కొంతమంది పరగడుపున తలనొప్పి లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు టాబ్లెట్స్ వేసుకుంటుంటారు. ఇలా చేయడంవలన అనేక దుష్ప్రభవాలు వచ్చి అనారోగ్యాలు వస్తాయి. అప్పుడప్పుడు కడుపులో నొప్పి, డయేరియా వచ్చే అవకాశం ఉంది.
ఉదయాన్నే కారంకారంగా మరియు మసాలాలతో వండిన పదార్థాలు తినకూడదు. ఇలా తినడం వలన కడుపులో ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడే హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ ఎక్కువగా విడుదలయి గుండెల్లో మంటగా, ఎసిడిటీ ని కలుగజేస్తుంది.
అలాగే ఉదయాన్నే పెరుగు అసలు తినకండి. ఇందులో అధికంగా ఉండే లాక్టిక్ యాసిడ్స్ వృద్ధి చేసే బాక్టీరియా పరగడుపున తినడంవలన ఎక్కువగా విడుదల చేసి కడుపుబ్బరం కలిగిస్తుంది.
ఇంకా ఉదయాన్నే అరటిపండు కూడా తినకూడదు. పరగడుపున అరటిపండులో తినడం వలన ఉండే మెగ్నిషియం రక్తంపై ప్రభావం చూపుతుంది. దీనివలన గుండెజబ్బులు, రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.
తర్వాత పియర్స్ పండు కూడా పరగడుపున తినకూడదు. ఇది కూడా జీర్ణవ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.
చిలకడదుంపల్లో టానిన్స్, పెప్టైన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపులో గందరగోళానికి కారణమవుతాయి.అలాగే జామకాయలు, ఆరెంజ్ వంటి సిట్రస్ జాతి పండ్లు తినకూడదు. ఇవి గ్యాస్ట్రిక్, ఎసిడిటీకి కారణమవుతాయి.
ఉదయాన్నే మద్యం తాగకూడదు. అలా తాగితే అది లివర్ పై ప్రభావం చూపుతుంది. దానివలన ప్రాణాలకే ప్రమాదం రావచ్చు.