రాత్రికి రాత్రే వెన్నునొప్పి, నడుము, కీళ్ళనొప్పులు తగ్గించే చిట్కా

ఒకప్పుడు మనుషులు ధృడంగా ఉండేవారు. మంచితిండి, శారీరక శ్రమ ఆరోగ్యం గా ఉండేలా చేసేవి.  పెద్ద వయసు వచ్చేంతవరకూ ఆరోగ్యంగా తమకు తాము అన్ని పనులు చేసుకునేవారు. కానీ ఇప్పటి రోజుల్లో మార్పులు తినే తిండి కలుషితమై పోయి,  శరీరానికి వ్యాయామం లేకపోవడంతో చాలా చిన్న వయసులోనే కీళ్ళు, కాళ్ళ నొప్పులు, శరీరంలో భుజాలు, కాళ్ళు, చేతులు, నడుము, వెన్ను నొప్పులని ఏపనీ చేయలేక బాధపడుతున్నారు.

ఈ నొప్పులకు కారణం అధికబరువు, అతిగా నడవడం లేదా ఎముకల మధ్యలో ఉండే మెత్తని గుజ్జు లాంటి పదార్థం అరిగిపోవడం లేదా ఆర్థరైటిస్. దీనికి ఎక్కువగా మందులు వాడడం వలన శరీరంలో ఇతర  అంతర్గత అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆయుర్వేదంలో గమనిస్తే మన ఇంట్లో ఉండే వస్తువులుతోనే కీళ్ళనొప్పులకు ఉపశమనం లభిస్తుంది.

అందులో ముఖ్యమైన పదార్థం జాజికాయ. జాజికాయ  ఒక విత్తనం, దీనిని సాధారణంగా మసాలా దినుసుల్లో ఒకటిగా ఉపయోగిస్తారు.  జాజికాయను  పొడిచేసి అందులో అరస్పూన్  ఆర్గానిక్ పసుపు, రెండు, మూడు స్పూన్ల ఆవనూనె వేసి బాగా కలపాలి. ఇది కొంచెం జారుగా ఉండే మిశ్రమంలా ఉండేలా చేసి నొప్పులు ఉండేచోట రాయాలి.

జాజికాయ దాని యాంటిడిప్రెసెంట్ కారకాల కారణంగా ఆందోళన,డిప్రెషన్ను తగ్గించడానికి సహాయపడుతుంది.  మీ  డైట్‌లో మసాలాగా తీసుకోవడం వలన జీర్ణక్రియను పెంచుతుంది.  పిల్లలకు విరేచనాలు మరియు కడుపు నొప్పి తగ్గించడానికి  ఇంటిచిట్కాగా  జాజికాయను ఉపయోగిస్తున్నారు.

ఇది కడుపులో మంట, ఎసిడిటీను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు కీళ్ల నొప్పుల, వాపుల నుండి ఉపశమనం ఇస్తుంది. జాజికాయను పాలలో మరిగించి తాగడంవలన  నిద్ర బాగా పట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. లైంగిక శక్తిని  ప్రోత్సహించడానికి ఉపయోగించే అనేక ఆయుర్వేద మందులలో భాగంగా జాజికాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్త్రీలలో సంతాన  సామర్థ్యం పెంచి ఆరోగ్యకరమైన సంతానం కలిగేలా చేస్తుంది.

పురుషులలో వీర్యవృద్దికి సహాయపడుతుంది. కీళ్ళనొప్పులు తగ్గించడంలో పసుపు కూడా చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో వేడిని కలిగించి నొప్పులనుండి ఉపశమనం ఇస్తుంది. అలాగే ఆవనూనెతో మసాజ్ చేయడం వలన కూడా నొప్పులు తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా నెలరోజులు వాడడం వలన మీరే ఆశ్చర్యకరమైన ఫలితాలు చూస్తారనడంలో అతిశయోక్తి లేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top