పురుషుల్లో అధిక ఒత్తిడి, తీవ్ర ఆలోచనలు, మధుమేహం, రక్తపోటు, అధికంగా మందులు వాడటం వలన సరైన లైంగిక శక్తి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వీటి వలన కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. పురుషుల్లో అధికంగా శీఘ్ర స్కలనం, అంగం స్థంభించకపోవడం, వంధ్యత్వం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే రెండు చిట్కాలను పాటించి అద్భుతమైన ఫలితాలను చూసిన వారు ఉన్నారు. అటువంటి రెండు చిట్కాలను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను.
అందులో ఒకటి నల్ల నువ్వులు. వీటిని తీసుకొని దోరగా వేయించి మెత్తని పొడిలా చేసుకోవాలి. కొన్ని ఉసిరికాయ ముక్కలను మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని 75 గ్రాముల చొప్పున కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నెయ్యి తో కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వలన పురుషుల్లో లైంగిక శక్తి పెరిగి అద్భుతమైన సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే మరొక చికిత్స కోసం లవంగాలను, పటిక బెల్లం లేదా మిస్రీ 35 గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని పొడిలా చేసుకోవాలి. ప్రతి రోజూ ఒక స్పూన్ చొప్పున గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి.
ఇలా కలిపి తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలు తగ్గించబడుతుంది. పురుషులలో సంతాన సమస్యలు, లైంగిక సమస్యలు తగ్గించి సంతోషకరమైన అనుభూతిని అందిస్తుంది. మధుమేహం ఉన్నవారు తేనె, పటిక ఉపయోగించకుండా ఈ చిట్కాలను పాటించాలి. పురుషుల్లో ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రించే వారిలో లైంగిక శక్తి పుష్కలంగా ఉంటున్నట్టు అనేక అధ్యయనాలు నిరూపించాయి. ప్రశాంతంగా నిద్ర పోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తగ్గడంతో పాటు లైంగిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.
అలాగే వ్యాయామం చేసే వారిలో కూడా ఎక్కువ కాలం లైంగిక అనుభూతిని పొందగలుగుతారు. వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ సంవత్సరానికి ఒక శాతం తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం, నిద్ర ఈ హార్మోన్ ఉత్పత్తిని పెంచి ఎక్కువ కాలం పాటు లైంగిక జీవితాన్ని అనుభవించేలా చేస్తుంది. ఇందులో వాడిన పదార్థాలన్నీ సహజమైనవి, ఆయుర్వేద డాక్టర్లచే సూచించబడినవి గనుక ఎటువంటి అనుమానం లేకుండా ఈ చిట్కాలను ఉపయోగించవచ్చు.