ఉల్లి శరీరంలోకి వెళ్ళగానే చేసే 5 మిరాకిల్స్

ఉల్లి  చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లిపాయ వల్ల అన్ని ప్రయోజనాలు మన శరీరానికి కలుగుతాయి అన్నమాట.  ఆధ్యాత్మిక సాధన చేసేవారికి   ఋషులకు శరీరంలో నెర్వస్ సిస్టంని, ఇంద్రియాలను స్టిమ్యులేట్ చేస్తుంది.  కాబట్టి  అలాంటివాటిని నిగ్రహించాలి అనుకున్నవారు ఇది మనకు తగదు అని ఋషులు వాళ్ల అనుచరులు ఉల్లిని ఉపయోగించడం మానేస్తారు. సాధారణ ప్రజలు అందరూ  ఉల్లిని ఉపయోగిస్తారు. ఉల్లిని ఉపయోగించే తీరు బాగుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. తీరు బాగా లేకపోతే ఎటువంటి ప్రయోజనాలు ఉండవు.

మనం  ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి నూనెలో బాగా వేయించడం వల్ల  ఉల్లిలో  ఉండే పోషకాలు,  పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ దెబ్బతింటాయి.  ఉల్లిపాయ పచ్చిగా తిన్న లేదా ఉల్లిపాయ పేస్ట్ లా చేసి ఉడికేటప్పుడు వేయడం వలన దానిలో ఉండే పోషకాలు దెబ్బతినవు.నూనె మానేసి మీగడ వేసి తాలింపు వేసిన లేదా నూనె బాగా వేడి చేయకుండా వేయాలి. ఇలా ఐతే ఎటువంటి నష్టం ఉండదు. ఉల్లిపాయలో దగ్గు, జలుబు రాకుండా చేసే గుణం ఉంది. ఉల్లిపాయ అలెర్జీ  కూడా తగ్గిస్తుంది.  ముఖ్యంగా అలెర్జీకి కారణం ఇస్టమిన్స్ విడుదలవ్వడం.

ఇస్టమిన్స్ ను శరీరంలో రక్షక వ్యవస్థ విడుదల చేస్తుంది. ఇస్టమిన్ రిలీజ్ కంట్రోల్ చేయడంలో ఉల్లిపాయలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ సహాయపడతాయి. రక్షక వ్యవస్థ కణజాలం ఇస్టమిన్ విడుదల చేయడం తగ్గించి అలెర్జీ తగ్గిస్తుంది. రక్షక వ్యవస్థలో మార్పులను ఉల్లిపాయ తీసుకొస్తుంది. శరీరంలో జలుబు, దగ్గు రావడానికి శరీరంలో కొన్ని ఫ్రీ రాడికల్స్ వంటి కెమికల్స్ ఎక్కువ అవ్వడం వలన జరుగుతుంది. పచ్చి ఉల్లిపాయలో  ఉండే ఆంటీఆక్సిడెంట్స్ వీటిని వెంటనే కంట్రోల్ చేసి  జలుబు, దగ్గును తక్షణమే తగ్గిస్తుంది. ఉల్లిపాయ ఆధ్యాత్మిక సాధన చేసే  ఋషులు మాత్రమే తినకుండా ఉంటారు.

మిగిలిన వాళ్ళు అందరూ ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవచ్చు. ఉల్లిపాయ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, అలర్జీ వంటివి వాటిని తక్షణమే తగ్గిస్తుందని సైంటిఫిక్గా 2015వ సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, USA వారు నిరూపించారు. ఉల్లిపాయ వలన ప్రయోజనాలు తెలుసున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉల్లిపాయను తెసుకోవాల్సిన పద్దతిలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఉల్లిపాయను  నూనె ఎక్కువ  వేడి చేసి కాకుండా తక్కువ వేడి చేసి లేదా మీగడతో తాలింపు వేసుకుని లేదా ఉల్లిపాయ గుజ్జులా తీసుకుని కూర ఉడికేటప్పుడు వేయడం వలన ఉల్లిపాయలో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top