సంవత్సరాలుగా పేరుకుపోయిన జిడ్డు, మురికి, సన్ టాన్ అంతా పూర్తిగా పోతుంది

సమ్మర్లో  అందరికీ సన్ టాన్  బాగా వచ్చేసి ఉంటుంది. ఈ సన్ టాన్ పోగొట్టుకోవడానికి పార్లర్ కి వేలకు వేలు  ఖర్చుపెట్టిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. కొంతమంది సన్  టాన్  రాకుండా ఉండడం కోసం సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేస్తూ ఉంటారు. అయినప్పటికీ డ్రెస్ లేని భాగం అంటే కాళ్ళు, చేతులు, మెడ వంటి భాగంలో సన్ టాన్ వచ్చేస్తుంది. ఈ చిట్కాతో  ఈజీగా ఇంట్లోనే  సన్ టాన్  మొత్తం పోగొట్టుకోవచ్చు. దీని కోసం కావలసిన పదార్థాలు బీట్రూట్,  షాంపూ, శెనగపిండి, బేకింగ్ సోడా, నిమ్మకాయ, పసుపు. రెండు మీడియం సైజు బీట్రూట్ తీసుకొని ఫీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్ వడగట్టుకుని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. బీట్రూట్  జ్యూస్ ఫ్రిజ్లో పెట్టి స్టోర్ చేసినట్లయితే  20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఏదైనా మీకు నచ్చిన బ్రాండ్ షాంపూ ఒక చెంచా వేసుకోవాలి. రెండు చెంచాల శెనగపిండి, అరచెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా నిమ్మరసం, చిటికెడు కస్తూరి పసుపు వేసుకోవాలి. తర్వాత దీంట్లో  పాక్ వేసుకోవడానికి సరిపడినంత  బీట్రూట్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ ను సన్  టాన్  ఉండే భాగంలో అంటే కాళ్ళు, పాదాలు, చేతులు, మెడ వెనుక భాగం, మెడ, చంకలు వంటి భాగంలో అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేసిన తర్వాత పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. సన్ టాన్  మొత్తం పోతుంది. నిమ్మకాయ ముఖం పై ఉండే దుమ్ము, ధూళి, మలినాలు వంటి వాటిని క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. మొటిమలను తగ్గించడంలో కూడా పనిచేస్తుంది. బేకింగ్ సోడా చర్మంపై ఉండే డస్ట్ పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. శెనగపిండి చర్మంపై ఉండే మలినాలు, డెడ్ స్కిన్  క్లియర్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.

బీట్రూట్  కొల్లాజెన్ ఉత్పత్తి పెంచి చర్మ రంగును మెరుగుపడేలా చేస్తుంది. కస్తూరి పసుపు కూడా చర్మ రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బీట్రూట్ వద్దు అనుకున్న వాళ్లు బీట్రూట్ బదులుగా టమాటా లేదా క్యారెట్ జ్యూస్ ఉపయోగించవచ్చు. నిమ్మకాయ పడదు అనుకున్నవాళ్ళు పొటాటో  జ్యూస్ లేదా టమాట జ్యూస్ ను ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా  వేసాం కాబట్టి ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయకూడదు. ముఖానికి వేసుకునే ప్యాక్ ఇప్పుడు  తెలుసుకుందాం.

ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల శెనగపిండి, ఒక చెంచా మిల్క్ పౌడర్, పావు చెంచా కస్తూరి పసుపు, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఈ పాక్  అప్లై చేసిన తర్వాత ఐదు గంటల వరకు సబ్బు యూస్  చేయకూడదు. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై ఉండే సన్ టాన్  పోయి మొహం క్లియర్ అవుతుంది. మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top