కొంతమందికి కళ్ళు లోతుగా ఉంటాయి. మరి కొంతమందికి కళ్ళు చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఇవి వంశపారపర్యంగా కూడా వస్తాయి. మరియు కొంతమందికి నిద్ర సరిగ్గా లేకపోవడం వలన, అంతేకాకుండా మానసిక ఒత్తిడి వలన కూడా ఇలా డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఓబైసిటీ వలన కూడా, మరికొంతమందికి హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఏ కారణం చేతనైనా కళ్ళ కింద నల్లటి చారలు వచ్చినప్పుడు వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
ఎందుకంటే ఎవరికైనా అందం ముఖ్యం. ఈ అందానికి ఆటంకం కలిగించే విధంగా ఈ డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని తగ్గించడానికి కరక్కాయ పొడి అద్భుతంగా పనిచేస్తుంది. మామూలుగా ఈ కరక్కాయ పొడిలో ఉండే చాలా పవర్ఫుల్ బయో ఆక్టివ్ కాంపౌండ్ ఏంటంటే పైరోగీలన్, ల్యూటియోగిన్, ల్యుమినాల్, రూటీన్ ఇలాంటివన్నీ చర్మంలో ఇన్ఫ్ల్మేషన్ తగ్గించడానికి చాలా ప్రధానంగా ఉపయోగపడతాయి. చర్మం లో ఇన్ఫ్ల్మేషన్ రావడం వలన ఈ కళ్ళ కింద ఉండే మెలనోసైట్స్ మెలనిన్ హార్మోన్ ను రిలీజ్ చేసి తక్కువ ఉండవలసిన ఏరియాలో ఎక్కువ పెట్టేస్తుంది.
కళ్ళ కింద కణాలలో ఈ ఇన్ఫ్ల్మేషన్ తగ్గించడానికి ఈ కాంపౌండ్స్ పనికొస్తాయి. అందువలన మన డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కరక్కాయ పొడి బాగా ఉపయోగపడుతుంది. అని నిరూపించిన వారు 2017 లో జియోమ్ సాంగ్ నేషనల్ యూనివర్సిటీ కొరియా వారు దీని మీద ప్రయోగాలు చేశారు. ఈ కరక్కాయ పొడిని ఎలా ఉపయోగించాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని రెండు పద్ధతుల్లో వాడుకోవచ్చు. ఒకటి కరక్కాయ పొడిని అలోవెరా జెల్ మరియు కొద్దిగా పసుపు ఈ మూడింటిని కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఉపయోగించవచ్చు.
ఇలా చేయడం ద్వారా ఇన్ఫ్ల్మేషన్ తగ్గుతుంది. కానీ మార్పు నెమ్మదిగా వస్తుంది. రెండవదిగా కరక్కాయ పొడి ఆల్మండ్ ఆయిల్ మరియు కొద్దిగా పసుపు అప్లై చేయడం ద్వారా డార్క్ సర్కిల్స్ క్లియర్ అవుతాయి. ఈ రెండింటిలో మీకు ఏది అనుకూలంగా ఉంటే దానిని ఉపయోగించవచ్చు. అందరి ఇళ్ళలో కరక్కాయ అనేది ఉంటుంది. కనుక ఇటువంటి కరక్కాయను ఉపయోగించడం ద్వారా మంచి లాభాలు ఉంటాయని నిరూపించడం అయింది. మరియు కరక్కాయను దగ్గు నివారించడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.