ప్రతి ఒక్కరి అందానికి జుట్టు కూడా ఒక కారణం అవుతుంది. మన జుట్టు ఎంత ఒత్తుగా ఉంటే అంత అందంగా కనిపిస్తాం. కానీ ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువైపోయి పల్చగా అయి అందరూ జుట్టు గురించి చింతిస్తూ ఉంటారు. ఇలా జుట్టు ఊడిపోవడానికి ప్రధానంగా పొల్యూషన్ కారణమైతే, మరొక విధంగా పోషకాహార లోపం. మరియు ఒత్తిడి వలన జుట్టు రాలిపోతుంది. కనుక మనం ఎన్ని ఉపయోగించిన సరైన ఆహారం తీసుకోకపోతే ఎటువంటి లాభం ఉండదు. కనుక మంచి పోషకాహారం తీసుకోవాలి.
మరియు ఒత్తిడి నుంచి విడుదల పొందే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు రెమిడి కొసం కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. ఒకటి ఉల్లిపాయలు. మనకు జుట్టు సరిపడినంత ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తురుముకొని పోడిగుడ్డ సహాయంతో వడ కట్టుకొని ఉల్లిపాయ రసాన్ని పక్కన పెట్టుకోవాలి. రెండవదిగా పట్టు తేనె. మూడవదిగా ఆలివ్ ఆయిల్. ఇప్పుడు రెమిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక స్పూన్ తేనెను కలుపుకోవాలి.
దీనికోసం మనం ఒరిజినల్ తేనెను ఉపయోగించాలి. కెమికల్స్ ఉన్న తేనెను ఉపయోగించడం ద్వారా ఎటువంటి ఫలితం ఉండదు. ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు లేదా రెండు మూతల ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన తలకు కుదుళ్ళ నుంచి చిగుళ్ల వరకు బాగా పట్టించి చేతివేళ్ళతో అరగంట సేపు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
అంతేకాకుండా మనం తయారు చేసుకున్న మిశ్రమం కుదుళ్ళకు బాగా పడుతుంది. ఇలా అరగంట ఉంచిన తర్వాత కుంకుడు కాయలు లేదా శీకాకాయతో తలస్నానం చేయాలి. ఇది ఉపయోగించిన తర్వాత ఎటువంటి షాంపూ ఉపయోగించకూడదు. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మన జుట్టు బాగా ఎదుగుతుంది. ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఉపయోగించిన తేనె వలన తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది….