భరించలేని ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్ మీకోసం వచ్చేసింది…..

దేవుడి దగ్గర కర్పూరం ను మనం హారతిగా వెలిగిస్తూ ఉంటాం. హారతి ఇచ్చినప్పుడు మనం ఆ హారతిని, దాని సువాసనను ఆస్వాదిస్తూ ఉంటాం. ఇంటిలో కూడా జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఎక్కువగా వేస్తూ ఉంటాం. ఈ కర్పూరం హారతి యొక్క వాసన చాలా మంచిది అని మన అందరికీ తెలుసు. ఇటువంటి కర్పూరం ను చాలా వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. అంటే తీర్థాలలో, ప్రసాదాలను కర్పూరం ను కలుపుతూ ఉంటారు. అటువంటి కర్పూరం నాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది.

కర్పూరం ఉపయోగించడం ద్వారా మనకు నొప్పి ఎందుకు తగ్గుతుంది అంటే ఎక్కడైనా దెబ్బలు, నొప్పులు, కాస్త బడలికలు వంటివి జరిగి అక్కడ నొప్పి వచ్చిన, ఎక్కడైనా క్రాంప్స్ వంటివి జరిగి నొప్పి ఉన్న, ఎప్పుడైనా కొండలు అవి ఎక్కి కాళ్లు నొప్పి వచ్చి ఒక్క రోజులో నొప్పి తగ్గించుకోవాలి అన్న, వ్యాయామాలు చేసినప్పుడు ఒళ్ళు పట్టేసినప్పుడు, ఎక్కడైనా కమిలిన అలాంటి ప్రదేశాల్లో కర్పూరం ను ఉపయోగించినప్పుడు నొప్పి వచ్చే భాగం నుంచి ఆ నొప్పిని నరాల ద్వారా నాడీ కణాలు మెదడుకు మోసుకొని వెళ్తాయి.

నరాల యొక్క ఎండింగ్స్ ని శాంతింప చేయడం ద్వారా అక్కడి నుంచి నొప్పిని తట్టుకునే షాక్ అబ్జర్వ్ లాగా ఆ కర్పూరం నరాలకు అందించి అక్కడి నుంచి తక్కువ నొప్పిని క్యారీ చేసి మెదడుకు అందించేలాగా కర్పూరం పనిచేస్తుంది. ఎందుకంటే నర్వ్ ఎండింగ్స్ ను శాంతింప చేస్తాయి. దీనివలన రీసేప్టార్స్ లో కొంచెం మార్పును తీసుకొస్తాయి. దీనివలన తక్కువ నొప్పి మెదడుకు క్యారీ అవుతుంది. తద్వారా నొప్పి తగ్గించే గుణం ఈ కర్పూరం లో ఉంది అని సైంటిఫిక్ గా నిరూపించబడింది. ఇది నిరూపించిన వారు 2004 లో సుధన్ యూనివర్సిటీ మెక్సీకో వారు ఈ పరిశోధనలు చేశారు.

ఇటువంటి కర్పూరము నొప్పి ఉన్నప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అంటే ముందుగా ఆవనూనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కొంచెం ఆవనూనెలో కర్పూరం వేస్తే అది కరిగిపోతుంది. ఇలా కరిగిన తర్వాత ఆ నూనెను కొంచెం పొయ్యి మీద పెట్టి మన శరీరం తట్టుకునే అంత వేడి చేసి నొప్పి ఉన్నచోట ఆ నూనెతో మర్దన చేయాలి. ఇలా రాసినప్పుడు నొప్పిని మోసుకు వేళ్లె నరాలను శాంతింప చేయడంతో పాటు ఏ ప్రదేశంలో రాసమె ఆ ప్రదేశంలో రక్తనాళాలు వ్యాకోచించింది రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. దీనివలన హీలింగ్ పవర్ బాగా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top