మీరు నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి…

మొదటిది నిద్ర బాగా పట్టాలంటే మంచి గాలి కావాలి. ఇక రెండవది రూమ్స్ లో ఉండే లైట్స్ ఆపేయాలి. రూమ్ లోకి లైట్ పడకూడదు. చీకటిగా ఉంటే మంచిది. లేదు అనుకుంటే చిన్న బెడ్ లైట్ అయిన పెట్టుకోవచ్చు. ఇక మూడవది కంటికి స్క్రీన్స్ చూడకుండా ఉండాలి. సెల్ఫోన్సు, టీవీ వల్ల ఈ లైట్  కంటిలోని రెటీనాలోకి వెళ్లి లోపల మెలటోనిన్ అనే హార్మోన్  రిలీజ్ కాకుండా అడ్డుకుంటుంది. అందుకని ఇవి చూడడం వల్ల ఈ రోజుల్లో నిద్ర ఎక్కువ రావట్లేదు. ఇక నాలుగోది రోజు ఒక టైం ప్రకారం పడుకుంటే బాడీ అలవాటు పడి ఆ టైంకీ బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇక ఐదవది నిద్రపోయేటప్పుడు దేని గురించి ఆలోచించకూడదు.

ఒకవేళ ఆలోచించినా దాని గురించి ఆలోచించకూడదు అని మైండ్లో పెట్టుకోవాలి. ఇక ఆరవది స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఉన్న వారికి నిద్ర రాదు. ఎందుకని అంటే స్ట్రెస్ హార్మోన్ ముఖ్యంగా కాట్జాల్ ఇలాంటి హార్మోన్లు రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ రిలాక్సేషన్ లోకి వెళ్ళవు. అందుకని అవి రిలాక్స్ అయితేనే మనకు నిద్ర వస్తుంది. ఇక ఏడవది ఎక్సైజ్ బాగా చేయాలి ఆటలు గాని, ఇంట్లో పని గానీ, ప్రాణాయామం, ఆసనాలు ఇలా ఏమి చేసినా మజిల్స్ అన్ని అలసిపోతాయి. వీటిని రిలాక్స్ చేయడానికి బాడీ మెల్టోనీ ని హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అందుకని అలసిపోయిన వారికి గాఢ నిద్ర పడుతుంది.

ఇక ఎనిమిదవది పడుకునేటప్పుడు బెడ్ రూమ్ లోకి మంచి సువాసన వచ్చే విధంగా ఆరోమాటిక్ ఆయిల్స్ గాని, పువ్వులు గాని పెట్టుకోవడం మంచిది. ఇక తొమ్మిదవది నరాలను ఉద్రేకపరిచే ఆహారాలను మానేయాలి. కెఫిన్. టొబాకో ఇలాంటివి తీసుకోకూడదు. వీటివల్ల నిద్ర పట్టదు. ఇక పదవది సాయంకాలం 6:00 కల్లా డిన్నర్ తింటే చాలా బాగా నిద్ర పడుతుంది. ఇక 11వది నైట్ నిద్ర పట్టాలి అంటే పగలు అస్సలు పడుకోకూడదు. ఇక 12వది పడుకున్న వెంటనే మనకు ఆలోచన వచ్చి నిద్రలోకి జారుకోనివ్వకుండా ఈ మనసు అడ్డుపడుతూ ఉంటుంది. దీన్ని నిద్రలోకి తీసుకువెళ్లాలి అంటే పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని మనసుని శ్వాస మీద పెట్టాలి.

అలా వెళ్లే శ్వాస, వచ్చే శ్వాసను గమనిస్తూ ఉంటే ఇలా రెండు నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే తెలియకుండానే నిద్ర పట్టేస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top