థైరాయిడ్ గ్రంధి సరైన హార్మోన్ రిలీజ్ చేయకపోవడం వల్ల హైపోథైరాయిడిజమ్ అంటారు. హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడేవారికి హార్మోన్ల టాబ్లెట్లు వాడుతున్నప్పటికీ బాగా పని చేయాలన్నా సమస్య నుండి బయట పడాలి అన్న తినవలసిన నట్స్ మంచివి ఉన్నాయి. ఈ నట్స్ ముఖ్యంగా 2 రకాలు ఒకటి బ్రెజిల్ నట్స్ రెండవది గుమ్మడి గింజలు. బ్రెజిల్ నట్ సెలీనియం ఎక్కువగా కలిగి ఉంటుంది. 100 గ్రాముల బ్రెజిల్ నట్స్ 19 నుండి 20 గ్రాముల సెలీనియం కలిగి ఉంటాయి.
సెలీనియం థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ హార్మోన్ ని స్టిమ్యులేట్ చేయడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంధి T3,T4 సరిగా ఉత్పత్తి చేయకపోతే థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయాలి దానికి సెలీనియం బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఫ్యాట్ చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. నాలుగు లేదా ఐదు నట్స్ తింటే సరిపోతుంది. ఇవి కాస్త పెద్ద సైజులో ఉంటాయి. వీటిని సుమారు 12 గంటల పాటు అని పెడితే కానీ తినడానికి బాగుండవు. నానబెట్టుకుని నాలుగైదు తింటే థైరాయిడ్ ఉన్న వారికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.
రెండవ తినాల్సిన నట్స్ గుమ్మడి గింజలు. ఇవి ముఖ్యంగా జింక్ ఎక్కువగా కలిగి ఉంటాయి. వందగ్రాముల గుమ్మడి గింజల లో దగ్గర దగ్గర 8 గ్రాములు జింకు ఉంటుంది. హైపోథైరాయిడిజమ్ ఉన్న వారికి TSH ఎక్కువ అయిపోతుంది. ఈ TSH తగ్గించడానికి గుమ్మడిగింజలలో ఉండే జింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. TSH రెండు చోట్ల నుంచి ఉత్పత్తి అవుతుంది. థైరాయిడ్ గ్రంథి నుండి రెండవది పిట్యూటరీ గ్లాండ్ నుండి థైరాయిడ్ హార్మోన్స్ రిలీస్ అవుతాయి.
ఈ హార్మోన్ రిలీస్ చేయడంలో రేగులేట్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. అందువలన ఈ రెండు నట్స్ థైరాయిడ్ ఉన్నవాళ్లు బాగా తినొచ్చు. ఇంకా తినకూడనివి కూడా కొన్ని ఉన్నాయి.ఒకటి పైన్ నట్స్. ఇవి చాలా ఖరీదైనవి కాబట్టి ఎవరు తినరు. కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయి. రెండవది గ్రౌండ్ నట్స్. హైపోథైరాయిడిజం ఉన్నవారు గ్రౌండ్ నట్స్ కూడా తినకపోవడం మంచిది. కొంచెం వేసుకుంటే తప్పులేదు. కానీ గ్రౌండ్ నట్స్ నానబెట్టుకుని తినకూడదు. ఫైన్ నట్స్, గ్రౌండ్ నట్స్ లో ఉండే కెమికల్స్ థైరాయిడ్ కణాలను డామేజ్ చేస్తాయి. కాబట్టి ఈ రెండు నట్స్ తినడం మానేయడం మంచిది. హైపోథైరాయిడిజంతో బాధపడేవారు బ్రెజిల్ నట్స్,పుంప్కిన్ నట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది.