ప్రస్తుత కాలం చాలామంది ఇబ్బంది పడుతున్నది అధిక బరువు. అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్ని రెమెడీస్ ఉపయోగించిన, ఎన్ని మందులు ఉపయోగించిన తగ్గడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటున్నారు. ఇప్పుడు మనం తయారు చేసుకోబయో డ్రింకులు ఏదైనా ఎంత బరువు ఉన్నా సరే తగ్గడానికి సహాయపడుతుంది. దీనికోసం మన ఇంట్లో ఉపయోగించి వస్తువులతో తయారు చేసుకుంటున్నాం. కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చాలా పవర్ ఫుల్ రెమిడీలు. ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.
డ్రింక్ 1. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక అంగుళం దాల్చిన చెక్కని వేసుకోవాలి. దాల్చిన చెక్క మన జీవక్రియను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మన జీర్ణ సంబంధ సమస్య నుంచి విడుదల అందిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. తర్వాత ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి. సోంపు కూడా మన జీర్ణ సంబంధ సమస్యల నుంచి విడుదల అందించి. గ్యాస్, ఉబ్బరంను తగ్గిస్తుంది.
ఇది బరువు తగ్గడంలో కూడా సహకరిస్తుంది. ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల నీటిని పోసుకొని బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వాము వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక గ్లాసులోకి వడకట్టుకొని అందులో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకొవాలి. అవసరమైతే తేనెను వేసుకోవచ్చు. దీనిని రోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఒకవేళ సాయంత్రం పూట తీసుకుంటే భోజనానికి ముందు తీసుకోవాలి.
డ్రింక్ 2. దీనికోసం ఒక గిన్నెలో ఒక అంగుళం దాల్చిన చెక్కను తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకుని బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత మనం ఉపయోగించే ఏదైనా కాఫీ పౌడర్ ను రెండు టీ స్పూన్లు వేయాలి. ఇలా వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఈ డ్రింక్ ని వాడకట్టుకొని ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. కావాలి అంటే ఒక స్పూన్ తేనెను కూడా కలుపుకోవచ్చు.
కాఫీ విత్ లెమన్ కాంబినేషన్ బరువు తగ్గడంలో సహాయపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది. కనుక ఈ రెండిటిలో ఏదైనా ఒకటి రోజు ఉపయోగించడం ద్వారా అధిక బరువు నుంచి విడుదల పొందవచ్చు. ఈ రెండు రెమెడీలు బరువు తగ్గించడంతో పాటు మనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి…..