హై షుగర్ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. పంచదార, బ్యాకరీ ఫుడ్స్ అన్నీ హై షుగర్ ఫుడ్స్. మైదా తో చేసే బేకరీలో కింది అన్ని కూడా కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువగా ఉండి డైరెక్ట్గా కార్బోహైడ్రేట్స్ రక్తంలోకి వెళ్లిపోతాయి. దీని వలన శరీరంలో షుగరు లెవెల్స్ పెరుగుతాయి. డైరెక్ట్ షుగర్ రిఫైన్డ్ షుగర్స్ ఏవైతే ఉంటాయో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా వెళ్ళిపోతుంది. ఈ గ్లూకోజ్ మొత్తం బ్రెయిన్ సెల్స్ లోకి వెళ్ళేసరికి తాత్కాలికంగా హుషారుగా అనిపిస్తుంది.
కానీ కొన్ని గంటల తర్వాత బాగా అలసి పోతాయి. ముందు బాగా ఎగ్జైట్ అయ్యి ఆక్టీవ్ అయిపోతాయి. తర్వాత త్వరగా అలసి పోతాయి. గ్లూకోజ్ బ్రెయిన్ కి వెళ్లడం వలన కణాలకి కణాలకి మధ్య సంబంధం దెబ్బతింటుంది. సెల్ రెసెప్టార్ దెబ్బతింటుంది. రిసెప్టార్ దెబ్బతింటే నరాలకు, మెదడుకి మధ్య కనెక్షన్ దెబ్బతింటుంది.మున్ముందు నరాలకు,మెదడుకు, మెదడు కణాలకి ఇబ్బంది అవుతుంది. ఫ్రక్టోజ్ రక్తకణాలలో ప్రవహించేసరికి రక్తనాళాలు హార్డ్ గా ఐపొతాయి.
బ్రెయిన్ కి రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు సిక్ ఐపొతాయి. బ్రెయిన్ కి సరిపడ రక్తం అందక బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోతాయి. హై షుగర్ ఫుడ్స్ బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోయేలా ప్రధానంగా కారణం అవుతాయి.60-70-80 ఏళ్ళు వచ్చేసరికి హై షుగర్ ఫుడ్స్, ఎంప్టీ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్స్ వీటన్నిటిలో లాంగ్ టర్మ్ లో బ్రెయిన్ సెల్స్ అన్నీ కుషించుకుపోతున్నాయని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసినవారు 2012వ సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, USA వారు. కానీ మనందరికీ ఇష్టం స్వీట్స్ అంటే మెత్తగా ఉంటాయి, గ్యాస్ రాదు.
ఇవి అన్నీ ఎంప్టీ కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే మైదాతోను, పిండ్లు తోను, పాలిష్ పట్టిన ఆహారాలతోను ముఖ్యంగా బేకరి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ తయారుచేస్తున్నారు.అందుకే లాంగ్ టర్మ్ లో బ్రెయిన్ సెల్స్ త్వరగా అలసిపోయినట్లు, త్వరగా వీక్ అయిపోయినట్లు ఉంటుంది. అందుకే కాసేపటిలోనే నాకు డల్ గా ఉంది, నీరసంగా ఉంది, ఆక్టీవ్ లేదని ఫీలింగ్ రావడానికి కారణం హై షుగర్ ఫుడ్స్.బ్రెయిన్ సెల్స్ ముందు బాగా ఊపు ఇచ్చేసి తర్వాత డల్ అయిపోతాయి.