ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈ సమస్య తగ్గించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెడతారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు మార్కెట్లో దొరికే రకరకాల ఇక్కడ కూడా ఉపయోగిస్తారు. వాటి వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. ఈ నూనె తయారు చేసుకుని వారంలో మూడు సార్లు ఉపయోగించినట్లయితే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నూనె తయారు చేసుకోవడానికి ముందుగా రెండు కలబంద మట్టలను తెచ్చి పక్కన పెట్టుకోవాలి.
దాని నుండి వచ్చే గ్రీన్ పదార్ధాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలోవేరాలో ఆంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి,విటమిన్ డి అధికంగా కలిగి ఉంటుంది. ఇవి జుట్టు రాలడం తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా కట్ చేసి పెట్టుకొన్న అలోవెరా ముక్కలను వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తరువాత కడాయిలో ఒక కప్పు కొబ్బరి నూనె వేసి మరగనివ్వాలి. గ్రీన్ కలర్ లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. నూనెను ఎక్కువగా మరిగించకూడదు.
ఎక్కువ మరిగించడం వలన అలోవెరాలో ఉండే పోషకాలు ఆవిరి అయిపోతాయి. ఆ నూనె ఉపయోగించడం వలన ఫలితం కూడా ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడం మంచిది. ఈ నూనె రోజు విడిచి రోజు కుదుళ్ళ నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు అప్లై చేసి ఉదయం ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా ఆరుసార్లు చేసినట్లయితే జుట్టు ఒక వారం రోజులలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలోవెరా జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
అలోవెరా జుట్టు మోయిశ్చరైజ్ చేసి జుట్టు సిల్కీ గా అవుతుంది. స్కాల్ప్ పై ఉండే చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించలేదు. కాబట్టి దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. ఈ నూనె ఉపయోగించడం వలన జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు మొత్తం రాలి పోయి జుట్టు సన్నగా ఉంది అనుకున్నవారు ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది.