ఈమధ్యకాలంలో మిల్క్ క్రీమ్ బదులుగా కొబ్బరి క్రీమ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మన శరీరానికి ప్రతిరోజు కొవ్వు 20 గ్రాములు కావాలి. ఎదిగే పిల్లలకు 30 గ్రాములు కావాలి. గర్భవతిగా ఉన్న వారికి 40 గ్రాములు కావాలి. శరీరానికి కొవ్వులు కావాలని మనం బయటి నుంచి నూనెలు అందిస్తాము. కానీ మన శరీరానికి కావలసింది నూనెలు కాదు కొవ్వులు. కొబ్బరి నూనె వాడొద్దు కొబ్బరి వాడండి వేరుశెనగ నూనె వద్దు వేరుశనగలు వాడండి నువ్వుల నూనె వద్దు నువ్వులు వాడండి.
కొబ్బరి ముక్కలను కొన్ని నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని దానిలో పాలను వడకట్టుకోవాలి. తర్వాత కొబ్బరి పాలను మళ్లీ మిక్సీ పడితే కొబ్బరి పాలలో ఉండే క్రీము, నీరు సపరేట్ అయిపోతాయి క్రీ పైకి తీసి ఫ్రిజ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. స్వీట్లలో, కూరలలో, శాండ్విచ్, ఫ్రూట్ సలాడ్, మొలకలు వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు. ఇది తినడం వలన జీరో ఫ్యాట్ వస్తుంది. కొబ్బరిలో సుమారుగా 45 శాతం కొవ్వు ఉంటుంది. కొబ్బరి, కొబ్బరి పాలు, కొబ్బరి తురుము చాలా బలమైన ఆహారాలు. కొబ్బరిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కదా ఎక్కువగా ఉపయోగించడం ఏమైనా నష్టం ఉంటుందా అంటే ఎటువంటి నష్టం ఉండదు.
ఎందుకంటే కొబ్బరి జీరో కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. బ్రెడ్ మీద జాము లేదా వెన్న రాసి పిల్లలకి ఇస్తూ ఉంటారు. దానికి బదులుగా కొబ్బరి క్రీము తేనె కూడ వేసి ఇవ్వొచ్చు. సైన్ విశ్వంలో వెజిటేబుల్స్ పెడతారు వాటి పైన కూడా క్రీమ్ వేసి ఇవ్వచ్చు. దీనిని చాక్లెట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. చాలా రుచిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పేస్ట్ చేసి కొబ్బరి క్రీమ్ లో కలిపి కొంచెం తేనె వేసి పొయ్యి మీద పెడితే చాక్లెట్ తయారవుతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది.
కూరలలో గ్రేవి ఎక్కువగా వద్దు అనుకున్నప్పుడు కానీ టేస్ట్ కావాలి అనుకుంటే కూరల పైన వేయడం వలన గ్రేవీ దగ్గరగా ఉండి టేస్ట్ బాగుంటుంది. కొన్ని స్పెషల్ వంటలలో ఒక రెండు గరిటెలు కొబ్బరి క్రీమ్ ఉపయోగించినట్లయితే చాలా టేస్ట్ గా ఉంటాయి. మొలకలు ఉత్తిగా తినలేక పోతున్నాము అనుకున్న వాళ్లు కొంచెం ఈ క్రీమ్ వేసుకుని కొంచెం నిమ్మరసం, తేనె వేసి తింటే చాలా రుచిగా ఉంటాయి.
చాలా స్టైల్ లో కొబ్బరి చట్నీ ఉపయోగించడం వలన గుల్లగా వస్తాయి మరియు చాలా రుచిగా కూడా ఉంటాయి. దిబ్బ రొట్టె, కుడుములు వంటివి చేసినప్పుడు మనం వెన్న రాస్తాము దానికి బదులుగా కొబ్బరి క్రీము రాస్తే బాగుంటుంది. పిల్లలకు టేస్టీగా, హెల్దీగా పెట్టాలి అంటే కోకనట్ క్రీమ్ పిల్లలకు చాలా బాగా పనిచేస్తుంది.